ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి: ఆ పాటే వాళ్లను కలిపింది

ముంబై: ఇది నిజంగా అద్భుతమనే చెప్పాలి. 40ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ వ్యక్తిని ఓ 'యూట్యూబ్ పాట' తిరిగి అతని కుటుంబానికి దగ్గరచేసింది. ఓ ఫోటోగ్రాఫర్ పుణ్యమాని 66ఏళ్ల వయసులో ఉన్న ఆ వృద్దుడు ఇప్పుడు తన కుటుంబానికి దగ్గరయ్యాడు.

మణిపూర్ రాజధాని ఇంఫాల్ కి చెందిన కోందాన్ సింగ్.. ఏవో విభేదాల కారణంగా 1978లో 26ఏళ్ల వయసులో ఇంటికి దూరమయ్యాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా అతని ఆచూకీ తెలియరాలేదు. అసలు అతను ఉన్నాడో.. లేడో అన్న సందేహం కూడా కలిగిన సందర్భాలు లేకపోలేదు.

అయితే ఇటీవల తమ పక్కింటి కుర్రాడు తన సెల్ ఫోన్ లో ఆ కుటుంబానికి ఓ వీడియో చూపించాడు. అందులో బూడిద రంగు వెంట్రుకలు, గుబురు గడ్డంతో ఓ ఉన్న వృద్దుడు పాటలు పాడటం గమనించారు. అతన్ని ఎక్కడో చూసినట్టుందని కాస్త దీర్ఘంగా ఆలోచించగా.. అతను తమ కోందాన్ సింగ్ అని గుర్తించారు.

IMPHAL

వెంటనే ఇంఫాల్ పోలీసులను ఆశ్రయించి ఈ విషయం చెప్పగా.. వారు ముంబై పోలీసులకు సమాచారం అందించారు. కోందాన్ సింగ్ యువకుడిగా ఉన్నప్పటి ఫోటోను ఆ కుటుంబం పోలీసులకు ఇచ్చింది. దీంతో కోందాన్ సింగ్ కోసం గాలించిన ముంబై పోలీసులు.. ఎట్టకేలకు బాంద్రా రైల్వే స్టేషనులో అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషనుకు తీసుకొచ్చారు.

ప్రస్తుతం కోందాన్ సింగ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఇంఫాల్ నుంచి ముంబై బయలుదేరారు. ఇన్నేళ్ల తర్వాత కోందాన్ సింగ్ ని కలుసుకోబోతుండటంపై ఆ కుటుంబం ఉబ్బితబ్బిబ్బవుతోంది.

కాగా, కోందాన్ సింగ్ ఆచూకీ గుర్తించడంలో షకీర్ అనే ఓ ఫోటోగ్రాఫర్ పాత్ర కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. తన యూట్యూబ్ చానెల్ కోసం వీడియోలను షూట్ చేయడం షకీర్ అలవాటు. ఇదే క్రమంలో కోందాన్ సింగ్ ను గమనించిన షకీర్.. అతనితో పాట పాడించి యూట్యూబ్ లో పోస్టు చేయించాడు.

'ముంబై వీధుల్లోని చిన్నారులు ఇతన్ని నేపాలీ అంటూ ఆటపట్టించేవారు. దానికి అతను.. నేను మణిపురి, నేపాలీ కాదు ఇండియన్ అంటూ బదులిచ్చేవాడు. పైగా పాటలు పాడుతూ వారిని ఎంటర్టైన్ చేసేవాడు. అలా రోడ్డు పైకి వెళ్లినప్పుడు.. అతను తారసపడితే అప్పుడప్పుడు అతని ఫోటోలు తీసేవాడిని. తినడానికి ఏమైనా ఆహారపదార్థాలు, కొంత డబ్బు ఇచ్చేవాడిని' అని ఫోటోగ్రాఫర్ షకీర్ చెప్పారు.

ఓరోజు కోందాన్ సింగ్ పాడుతుండగా షకీర్ వీడియో షూట్ చేశాడు. ఆ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారి.. చివరకు ఇంఫాల్ లోని అతని కుటుంబాన్ని చేరింది. అత్యంత ఆశ్చర్యకరంగా ఉన్న ఈ ఘటన ఆ కుటుంబాన్ని అమితానందానికి గురిచేసింది.

కాగా, కోందాన్ సింగ్ గతంలో ఆర్మీలో పనిచేసినట్టు తనతో చెప్పాడని ఫోటోగ్రాఫర్ షకీర్ వెల్లడించారు. తండ్రి మరణంతో ఆర్మీ నుంచి వచ్చేశాడని, తన సోదరులతో తలెత్తిన విభేదాల కారణంగా మణిపూర్ లోని ఇంటిని కూడా వదిలేశాడని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+