మిజోరాం ఎన్నికలు రేపే.. అక్కడ త్రిముఖ రాజకీయ చదరంగం.. గెలుపెవరిదో!!
మిజోరం ఎన్నికలు: ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో రేపు ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 8.57 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును రేపు మిజోరం ఎన్నికలలో వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం 1276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇక బంగ్లాదేశ్, మయన్మార్ తో సరిహద్దులు పంచుకునే ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 30 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు.ఈ ఎన్నికలలో ప్రధానంగా 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే మిజోరంలో 2023 ఎన్నికలలో ఏ పార్టీ కీలకం కాబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మిజోరం ఓటర్లు రేపు తమ తుది తీర్పును ఇవ్వనున్నారు.మిజోరంలో అధికార మిజో నేషనలిస్ట్ ఫ్రంట్, కాంగ్రెస్, జోరాం పీపుల్స్ మూమెంట్ మధ్య ప్రధానంగా పోటీ కొనసాగుతుంది. త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం మిజో నేషనలిస్ట్ ఫ్రంట్ జోరుగా ప్రచారం చేసింది. ఐదు సంవత్సరాలలో తాము చేసిన అభివృద్ధితోపాటు , శరణార్థులు, వలసలు వచ్చిన వారి అంశాన్ని ఉపయోగించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది.
మిజోరంలో గత రెండు పర్యాయాలుగా అధికారాన్ని పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ పట్టు దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది గత ఎన్నికల సమయంలో ఎంఎన్ఎఫ్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రధాన ప్రచార అస్త్రంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం కొనసాగించింది. ఇక గత ఎన్నికలలో స్థానాలలో విజయం సాధించి సంచలనం సృష్టించిన జెడ్ పి ఎం పార్టీ ఈసారి తన సత్తా చాటాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది.
మార్పు కోసం తమకు పట్టం కట్టాలని జెడ్ పీఎం పార్టీ జోరుగా ప్రచారాన్ని సాగించింది. మరి రేపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న నేపథ్యంలో వారు ఏ పార్టీకి మద్దతుని ఇస్తారు? ఎవరికి పట్టం కడతారు అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications