mizoram polls: టికెట్ ఇవ్వలేదని మిజోరం స్పీకర్ రాజీనామా-బీజేపీలో చేరేందుకు రెడీ..!
ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఎన్నికల రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. వచ్చే నెలలో ఎన్నికలకు సిద్దమవుతున్న మిజోరంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందన్న సర్వే రిపోర్టులు అన్ని పార్టీల్ని అప్రమత్తం చేశాయి. దీంతో ఇక్కడ ప్రతీ సీటులోనూ గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార ఎంఎన్ఎఫ్ అసెంబ్లీ స్పీకర్ లాల్రిన్లియానా సైలోకు మరోసారి టికెట్ నిరాకరించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించడంతో మిజోరం అసెంబ్లీ స్పీకర్ లాల్రిన్లియానా సైలో తన సొంత పార్టీ ఎంఎన్ఎఫ్ కు గుడ్ బై చెప్పేశారు. నవంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ నిరాకరించడంతో మిజోరాం శాసనసభ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించిన ఆయన.. మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్‌ఎఫ్ కు కూడా గుడ్ బై చెప్పేశారు. తన పదవితో పాటు సభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.

మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఎంఎన్ఎఫ్ స్పీకర్ సైలోకు టికెట్ నిరాకరించడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి బీజేపీ పంచన చేరుతున్నారు. త్వరలో అధికారికంగా ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఆ తర్వాత ఆయనకు టికెట్ ప్రకటించే అవకాశం ఉంది.
40 మంది ఎమ్మెల్యేలు ఉన్న మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. వివిధ కారణాలతో వీరు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.ఇలా ఎన్నికలకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో స్పీకర్ సైలో ఎనిమిదో వారు కావడం విశేషం. ఆయన ఇవాళ కేంద్ర నేతల సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. సైలో మమిత్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications