వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఎంపీ నుంచి మోడీ మంత్రివర్గంలోకి: ఎవరీ ఎంజే ఆక్బర్?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎంజే అక్బర్... మంగళవారం ప్రధాని మోడీ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఓ జర్నలిస్ట్‌గా, రచయితగా, రాజకీయవేత్తగా, ఇప్పడు కేంద్రమంత్రిగా ఆయన అలుపెరగని పయనం మాత్రం 1989లోనే ప్రారంభమైంది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ, అక్బర్‌లోని ప్రతిభను గుర్తించి బీహార్‌లోని కిషన్ గంజ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు.

విస్తరణ: ప్రధాని మోడీ స్ట్రాటజీ, కొత్త మంత్రులు వీరే..విస్తరణ: ప్రధాని మోడీ స్ట్రాటజీ, కొత్త మంత్రులు వీరే..

అప్పటి ఎన్నికల్లో అక్బర్ గెలిచారుగానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఘోర పరాభవాన్ని చవిచూసింది. గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్న అక్బర్ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జీవిత చరిత్రతో పాటు ఎన్నో అద్భుతమైన పుస్తకాలను రచించారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం నెమ్మదిగా రాజకీయాలకు దూరం జరిగిన ఆయన తన వృత్తి అయిన జర్నలిజంలో దశాబ్దానికి పైగా కొనసాగారు.

MJ Akbar's journey from a Congress MP to being appointed as Modi's minister

గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఎన్నిక తర్వాత ఆయనకు మరితంగా దగ్గరయ్యారు. ఆ తర్వాత 2002లో జరిగిన గోద్రా అల్లర్ల సమయంలో మోడీ వెన్నంటే ఉన్నారు. హిందూత్వమే ప్రధాన అజెండాగా పనిచేసే బీజేపీలో చేరారు. బీజేపీలో ముస్లిం వాదనను వినిపించే అతికొద్ది మంది నేతల్లో అక్బర్ ఒకరు.

ఇటీవల రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. అక్బర్ చేరికతో మోడీ మంత్రివర్గంలో ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడే ముస్లిం వ్యక్తి ఎంపికైనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఎంజే అక్బర్ వయస్సు 65 ఏళ్లు. ఈ వయసులో కూడా పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతుంటారు.

English summary
M J Akbar’s debut as a minister caps a remarkable political turnaround for the journalist and author who made a dashing foray into politics as a Congress MP in 1989, thanks to his proximity to the then Prime Minister Rajiv Gandhi, before a long spell in wilderness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X