"ఎమర్జెన్సీ గుర్తుకొస్తోంది"- ఢిల్లీ అణచివేతలపై ఎంకే స్టాలిన్ ట్వీట్..!

సీఈసీ జ్ఢానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ, విపక్షాలు, విద్యార్ధి సంఘాలు పిలుపిచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, కేంద్రం కలిసి అణచివేతలకు దిగాయి. ఢిల్లీకి బయటి నుంచి రాకపోకలు సాగించకుండా అడ్డుకోవడంతో పాటు జాతీయ రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున ఆంక్షల్ని అమలుచేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతలు దిప్కే, అశుతోష్, సౌరవ్ దాస్ లను విమానంలోనే అదుపులోకి తీసుకుని అజ్ఢాత ప్రాంతానికి తరలించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అణచివేతపై తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్రంగా స్పందించారు.

Abhijeet Dipke: విమానంలోనే అభిజీత్ దిప్కే అరెస్ట్-ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత..!
Abhijeet Dipke: విమానంలోనే అభిజీత్ దిప్కే అరెస్ట్-ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత..!

ఈ రోజు ఢిల్లీలో చోటుచేసుకుంటున్న దృశ్యాలు, శాంతియుత నిరసనకారులపై ప్రయోగిస్తున్న అణచివేత స్థాయి, నేను అనుభవించిన ఎమర్జెన్సీ నాటి బాధాకరమైన జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెస్తున్నాయంటూ ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో , అలాగే దేశవ్యాప్తంగా నిర్బంధించిన రాజకీయ నాయకులు, విద్యార్థులు, యువ నిరసనకారులందరినీ తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీకి అనుబంధంగా వ్యవహరిస్తూ, నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసు అణచివేతను ప్రయోగిస్తున్న తమిళనాడులోని టీవీకే ప్రభుత్వాన్ని కూడా తాను తీవ్రంగా ఖండిస్తున్నానని స్టాలిన్ పేర్కొన్నారు.

MK Stalin Invokes Emergency Memories Demands Release of Detained Protesters and CEC s Resignation

ఢిల్లీకి భారీగా తరలివస్తున్న జనం..! అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్రం కీలక ఆదేశం..!
ఢిల్లీకి భారీగా తరలివస్తున్న జనం..! అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్రం కీలక ఆదేశం..!

శాంతియుతంగా నిరసన తెలిపే తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటున్న యువతపై కేంద్ర ప్రభుత్వం తన దాడిని తక్షణమే ఆపాలని ఎంకే స్టాలిన్ కోరారు. అసమ్మతి అనేది నేరం కాదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చేవారి గొంతు నొక్కడం ద్వారా ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని ఆయన గుర్తుచేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా విషయంలో రాజీ పడటానికి ఆస్కారం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఆయన రాజీనామాతో పాటు, ఎన్నికల సంఘం సంస్థాగత స్వరూపానికి జరిగిన నష్టాన్ని అంతా పూడ్చి, దాని స్వతంత్రతను, సమగ్రతను పునరుద్ధరించాలని డీఎంకే అధినేత డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+