డీఎంకే ఫ్యామిలీలో చిచ్చు: స్టాలిన్ అందుకే కనిమొళిని దూరం పెట్టారా !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరు మొదలై రెండు వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల గుర్తు ఇరు వర్గాల్లో ఎవ్వరికీ కేటాయించకుండా ఎన్నికల కమిషన్ రిజర్వులో పెట్టింది.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు డీఎంకే పార్టీలో ఇంటి పోరు మొదలైయ్యిందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై స్థానిక తమిళ మీడియాలో జోరుగా చర్చ మొదలైయ్యింది. డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి కుటుంబ సభ్యులు అంతర్గతంగా ఒకరి మీద ఒకరు మండిపడుతున్నారని విశ్వసనీయ సమాచారం.

ఎంకే. స్టాలిన్ ఎందుకు అలా చేశారు !

ఎంకే. స్టాలిన్ ఎందుకు అలా చేశారు !

డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభలో ప్రధాన పత్రిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ జోరుగా ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా ఆర్ కే నగర్ నియోజక వర్గంలో పోటీ చేస్తున్న డీఎంకే పార్టీ అభ్యర్థి మరుదు గణేష్ ను గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

సొంత సోదరిని దూరం పెట్టారు ఎందుకు ?

సొంత సోదరిని దూరం పెట్టారు ఎందుకు ?

డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చెయ్యాలని ఆసక్తిగా ఉన్నారు. అయితే ఆర్ కే నగర్ లో కనిమొళితో ప్రచారం చేయించడానికి ఎంకే. స్టాలిన్ కు ఇష్టం లేదని డీఎంకే పార్టీ వర్గాలు అంటున్నాయి.

అప్పుడు అన్న ఇప్పుడు సోదరి

అప్పుడు అన్న ఇప్పుడు సోదరి

కరుణానిధి కుమారులు అళగిరి, ఎంకే. స్టాలిన్ వర్గాల్లో ఒకరిని చూస్తే ఒకరికి గిట్టదు అనేది అందరికీ తెలిసిందే. కరుణానిధి అనారోగ్యానికి గురైన సమయంలో అళగిరి, స్టాలిన్ కలిసిపోయారు. అయితే ఇప్పుడు స్టాలిన్ తన సోదరి కనిమొళి మీద ఎందుకు గుర్రుగా ఉన్నారో తెలియడం లేదని డీఎంకే వర్గాలు అంటున్నాయి.

ఢిల్లీలోనే మకాం వేసిన కనిమొళి

ఢిల్లీలోనే మకాం వేసిన కనిమొళి

రాజ్యసభ సభ్యురాలు చెన్నై రాకుండా ఢిల్లీలోనే మకాం వేశారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర గత 18 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతులకు మద్దతుగా శుక్రవారం ఆమె ధర్నాలో పాల్గొన్నారు.

అప్పుడు అవకాశం ఇస్తారా ?

అప్పుడు అవకాశం ఇస్తారా ?

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసే చివరి రోజుల్లో సోదరి కనిమొళి అక్కడ ప్రచారం చెయ్యడానికి అవకాశం కల్పిస్తారని తెలిసింది. అయితే ఈ విషయంపై డీఎంకే నాయకులు ఏవిధంగానూ స్పంధించడం లేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
DMK Sources said that their Working President MK Stalin still not allow to Rajya Sabha MP Kanimozhi to Campaign in RK Nagar By election.
Please Wait while comments are loading...