తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

MLA: సిట్టింగ్ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు, హత్యకు ప్రత్యర్థుల స్కెచ్, కోర్టు ఆర్డర్ తో రీ ఓపెన్, మ్యాటర

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/తిరుపతి: అధికార పార్టీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు (టీటీడీ) కేసు ఊహించని మలుపు తిరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేని హత్య చెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ప్రత్యర్థి పార్టీకి చెందిన లీడర్ పరార్ కావడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిట్టింగ్ పార్టీ ఎమ్మెల్యేని హత్య చెయ్యడానికి ప్రత్యర్థి పార్టీ నాయకుడు ప్రయత్నించాడని గతంలో కేసు నమోదు అయ్యింది. తరువాత కోర్టు ఆదేశాలతో ఈ కేసు మూలనపడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మరోసారి కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు ఈ కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది.

Lady: భర్త అమాయకుడు, మామ కామాంధుడు, కోడలిని గిల్లిన మామ, కోడలు ఏం చేసిందంటే ?Lady: భర్త అమాయకుడు, మామ కామాంధుడు, కోడలిని గిల్లిన మామ, కోడలు ఏం చేసిందంటే ?

సిట్టింగ్ ఎమ్మెల్యే

సిట్టింగ్ ఎమ్మెల్యే

బెంగళూరు సిటీలోని యలహంక శాసన సభ నియోజక వర్గం నుంచి బీజేపీ నుంచి పోటీ చేసిన ఎస్ఆర్. విశ్వనాథ్ వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నాడు. బీజేపీలో ఎస్ఆర్. విశ్వనాథ్ కు మంచి గుర్తింపు ఉంది. ప్రవాసాంధ్రులు ఎక్కువగా నివాసం ఉంటున్న యలహంక నియోజక వర్గంలో ఎస్ఆర్. విశ్వనాథ్ రెడ్డి అలియాస్ విశ్వనాథ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడితో ?

కాంగ్రెస్ పార్టీ నాయకుడితో ?

యలహంకలో బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్. విశ్వనాథ్ కు కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోపాలక్రిష్ణ గట్టిపోటీ ఇస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్, విశ్వనాథ్ కు, గోపాలక్రిష్ణల మద్య గట్టి పోటీ ఉంది. ఇదే సమయంలో గతంలో ఇరు వర్గాల వారు గొడవలుపడ్డారని తెలిసింది.

ఎమ్మెల్యేని హత్య చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ?

ఎమ్మెల్యేని హత్య చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ?

యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్, విశ్వనాథ్ ను హత్య చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గతంలో ఆరోపణలువచ్చాయి. యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్, విశ్వనాథ్ గతంలో రాజనకుంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఈ కేసు కోర్టు వరకు వెళ్లింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు కోర్టును ఆశ్రయించారు.

ఎమ్మెల్యే ఏం చెప్పారంటే ? స్టే ఇచ్చిన కోర్టు

ఎమ్మెల్యే ఏం చెప్పారంటే ? స్టే ఇచ్చిన కోర్టు

తన ఇంటికి ఓ కొరియర్ వచ్చిందని, ఆ కోరియర్ లో మేము మిమ్మల్ని చంపాలని ప్రయత్నించామని, నన్ను క్షమించాలని రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవరాజ్ అలియాస్ కుళ్ల దేవరాజ్ క్షమాపణల లేఖతో పాటు వారు మాట్లాడుకుంటున్న వీడియో రికార్డు చేసిన పెన్ డ్రైవ్ ఉందని బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ కోర్టుకు చెప్పారు. ఇదే కేసులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోపాలక్రిష్ణ కోర్టును ఆశ్రయించాడు.

కేసు మళ్లీ రీ ఓపెన్

కేసు మళ్లీ రీ ఓపెన్

అప్పట్లో కోర్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్పించిన పిటిషన్ విచారణ చేసి కేసు విచారణకు స్టే విధించింది. ఇప్పుడు మళ్లీ కేసు విచారణ జరిపించాలని, తనకు ప్రాణహాని ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్, విశ్వనాథ్ బెంగళూరు 2వ ఏసీజేఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ చేసిన కోర్టు మళ్లీ కేసు దర్యాప్తు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగరాజ్ అలియాస్ కుళ్ల నాగరాజ్ ను రాజనకుంటే పోలీసులు అరెస్టు చేశారు కాంగ్రెస్ పార్టీ లీడర్ గోపాలకిష్ణ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
MLA: Conspiracy to kill BJP MLA SR Vishwanath case arrested one accused in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X