మోదీకి షాక్, టైమ్ చూసి దెబ్బ కొట్టిన గాలి జనార్దన్ రెడ్డి, సీఎంతో రహస్య చర్చలు, ఆ రెడ్డికి గుబులు !
లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు ఇప్పటికే సిద్ధం అయ్యాయి. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికలకు కర్ణాటకలోని బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించగా ఐదో అభ్యర్థి రంగంలోకి దిగడం హాట్ టాపిక్ అయ్యింది. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినా జేడీఎస్ నాయకులు రాజ్యసభ సభ్యుడు మాజీ ఎంపీ కుపేంద్ర రెడ్డిని రంగంలోకి దింపడం హాట్ టాపిక్ అయ్యింది.
ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు జరుగుతుండటంతో పలు రాజకీయ పార్టీలు, పార్టీయేతర అభ్యర్థులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఇప్పుడు కర్ణాటక సీఎం సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌తో కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరపడం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది.

సోమవారం విధాన సౌధలో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో సమావేశమైన ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి రహస్యంగా చర్చలు జరిపారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్, గాలి జనార్దన్ రెడ్డిల భేటీ భిన్నమైన చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై ట్వీట్ చేస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయిన గాలి జనార్దన్ రెడ్డితో చర్చలు జరిపామని చిన్నక్లూ కూఇచ్చారు. మామూలుగానే మేము భేటీ అయ్యామని సీఎం సిద్దరామయ్య అంటున్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లతో భేటీ అయిన తరువాత విధాన సౌధలో గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ఆనెగొందే పండుగను వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి నెలలో ఈ వేడుకలు వైభవంగా జరుపుకుంటారని, ఇందుకు సంబంధించి సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ లను ఆహ్వానించేందుకు ఇక్కడికి వచ్చానని గాలి జనార్దన్ రెడ్డి మీడియాకు చెప్పారు.

సీఎం సిద్దరామయ్య , డీసీఎం డీకే శివకుమార్ భేటీలో రాజ్యసభ ఎన్నికలపై చర్చ జరిగిందా అనే ప్రశ్నకు గాలి జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో తమకు ఓటు వెయ్యాలని అందరూ తనకు మనవి చేశారని అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారని, అలాగే తనకు ఓటు వెయ్యాలని చెప్పారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. దీనిపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వెయ్యడం తన వ్యక్తిగతం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications