తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

MLA: సిట్టింగ్ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడి హత్యకు స్కెచ్, సీఎం ఎంట్రీ, రాజకీయ కక్షలు, ఆంధ్రా నుంచి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/తిరుపతి: నియోజక వర్గంలో తిరుగులేని నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు, బీడీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాయకుడిని హత్య చెయ్యడానికి స్కెచ్ వేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. రాజకీయంగా ఎదుర్కోలేని వ్యక్తి, గత ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయిన వ్యక్తి తన హత్యకు ప్లాన్ వేశాడని తెలిసి షాక్ అయ్యానని సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేని హత్య చెయ్యడానికి ప్రత్యర్థులు మాట్లాడుకుంటున్న ఆడియో టేపులు బయటకు రావడం కలకలం రేపింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పటికే సీఎం, హోమ్ శాఖా మంత్రి, సిటీ పోలీసు కమీషనర్ తో మట్లాడారు. తన హత్యకు ఆంధ్రప్రదేశ్ నుంచి కిరాయి హంతకులను రంగంలోకి దింపారని తనకు సమాచారం అందిందని సిట్టింగ్ ఎమ్మెల్యే మీడియాకు చెప్పారు. తన హత్యకు స్కెచ్ వేసిన ప్రముఖుడు ఇప్పటికే తనను క్షమించాలని, తప్పు జరిగిపోయిందని తనకు క్షమాణ పత్రం పంపించాడని, అన్నీ పోలీసులే చూసుకుంటారని సిట్టింగ్ ఎమ్మెల్యే మీడియాకు చెప్పారు. అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేని హత్య చెయ్యడానికి ప్రయత్నించారని వెలుగు చూడటం ఐటీ హబ్ లో కలకలం రేపింది.

Illegal affair: మూడు రోజులు భార్య ఎస్కేప్, పక్కాప్లాన్ తో భార్య బిడ్డలను చంపేసి ఆత్మహత్య !Illegal affair: మూడు రోజులు భార్య ఎస్కేప్, పక్కాప్లాన్ తో భార్య బిడ్డలను చంపేసి ఆత్మహత్య !

 బెంగళూరులో పవర్ ఫుల్ లీడర్

బెంగళూరులో పవర్ ఫుల్ లీడర్

బెంగళూరులోని యలహంక శాసనసభ నియోజక వర్గంలో తిరుగులేని నాయకుడిగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎస్ఆర్. విశ్వనాథ్ ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యలహంక నియోజకవర్గంలో బీజేపీలో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యే విశ్వనాథ్ హైకమాండ్ దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 టీటీడీ బోర్డు సభ్యుడు

టీటీడీ బోర్డు సభ్యుడు

యలహంక శాసన సభ నియోజక వర్గంలో కొన్ని వేల మంది ప్రవాసాంధ్రులు నివాసం ఉంటున్నారు. ప్రవాసాంధ్రులకు ఎలాంటి సమస్య వచ్చినా మొదట ఎమ్మెల్యే ఎస్ఆర్. విశ్వనాథ్ దగ్గరకే వెలుతారు. ఇటీవల జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కార్యవర్గంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా బెంగళూరులోని యలహంక నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్. విశ్వనాథ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి ఆయనకు అవకాశం ఇచ్చారు.

 బీజేపీ ఎమ్మెల్యే హత్యకు స్కెచ్ !

బీజేపీ ఎమ్మెల్యే హత్యకు స్కెచ్ !

గత శాసన సభ ఎన్నికల్లో యలహంక నియోజక వర్గం నుంచి బీజేపీ టిక్కెట్ మీద ఎస్ఆర్. విశ్వనాథ్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోపాలక్రిష్ణ పోటీ చేశారు. శాసన సభ ఎన్నికల్లో ఎస్ఆర్. విశ్వనాథ్ చేతిలో గోపాలక్రిష్ణ ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోపాలక్రిష్ణ, ఆయన శిష్యుడు కుళ్ల సీన అలియాస్ కుళ్ల శ్రీనివాసులు కలిసి బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్. విశ్వనాథ్ హత్యకు స్కెచ్ వేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

 ఆడియో టేప్ తో హడల్

ఆడియో టేప్ తో హడల్

కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోపాలక్రిష్ణ, కుళ్ల సీన అలియాస్ కుళ్ల దేవరాజ్ కలిసి బీజేపీ ఎమ్మెల్యే హత్యకు స్కెచ్ వేస్తున్న సమయంలో మాట్లాడుకున్న ఆడియో టేపు విడుదల కావడం కలకలం రేపింది. యలహంక నియోజక వర్గంలో తిరుగులేని నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు, బీడీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వనాథ్ ను హత్య చెయ్యడానికి స్కెచ్ వేశారని వెలుగు చూడటం ఐటీ హబ్ బెంగళూరులో కలకలం రేపింది.

రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్లాన్ వేశారు

రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్లాన్ వేశారు

రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోపాలక్రిష్ణ గత శాసనసభ ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయాడని, ఆ వ్యక్తి తన హత్యకు ప్లాన్ వేశాడని తెలిసి షాక్ అయ్యానని సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వనాథ్ బుధవారం బెంగళూరులో మీడియాకు చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వనాథ్ ను హత్య చెయ్యడానికి ప్రత్యర్థులు మాట్లాడుకుంటున్న ఆడియో టేపులు బయటకు రావడం కలకలం రేపింది.

 సీఎంతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే

సీఎంతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే

బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వనాథ్ ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, హోమ్ శాఖా మంత్రి, బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ తో ఈ విషయం గురించి మట్లాడారు. తనకు పోలీసు భద్రత కల్పించాలని సీఎం, హోమ్ మంత్రి, పోలీసు కమీషనర్ కు మనవి చేశానని బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్. విశ్వనాథ్ మీడియాకు చెప్పారు.

 ఆంధ్రా నుంచి కిరాయి హంతకులు ?

ఆంధ్రా నుంచి కిరాయి హంతకులు ?

తన హత్యకు ఆంధ్రప్రదేశ్ నుంచి కిరాయి హంతకులను రంగంలోకి దింపారని తనకు సమాచారం అందిందని బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ బుధవారం బెంగళూరులో మీడియాకు చెప్పారు. తన హత్యకు స్కెచ్ వేసిన ప్రముఖుడు కుళ్ల సీన ఇప్పటికే తనను క్షమించాలని, తప్పు జరిగిపోయిందని తనకు క్షమాపణ పత్రం పంపించాడని బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ అన్నారు.

Recommended Video

Chandrababu ఏడుపు నటన - Vamsi దిగజారుడు రాజకీయాలు | Lokesh పుట్టుక గురించి || Oneindia Telugu
 పోలీసులే చూసుకుంటారు

పోలీసులే చూసుకుంటారు

తన హత్యకు స్కెచ్ వేసిన వారి గురించి బెంగళూరు సిటీ పోలీసులే చూసుకుంటారని, పోలీసు అధికారుల మీద తనకు పూర్తి నమ్మకం ఉందని బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వనాథ్ మీడియాకు చెప్పారు. అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వనాథ్ ను హత్య చెయ్యడానికి ప్రయత్నించారని వెలుగు చూడటం ఐటీ హబ్ బెంగళూరులో కలకలం రేపింది. బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ హత్యకు స్కెచ్ వేశారని వెలుగు చూడటంతో ఆ కేసును బెంగళూరు సీసీబీ పోలీసులకు అప్పగించారు. మా అభిమాన నాయకుడు విశ్వనాథ్ హత్యకు స్కెచ్ వేశారని తెలుసుకున్న యలహంక శాసనసభ నియోజక వర్గం మ్మెల్యే అభిమానులు, బీజేపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు.

English summary
MLA: Planning to Kill Bengaluru Yelahanka MLA and BDA chairman SR Vishwanath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X