బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

MLA: గాలి జనార్దన్ రెడ్డి తమ్ముడు, బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డికి జైలు శిక్ష, అయితే ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బళ్లారి: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, బీజేపీ ఎమ్మెల్యేకి కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. అక్రమంగా రివాల్వర్ పెట్టుకుని చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి మీద గతంలో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది. కేసు విచారణ చేసిన ప్రత్యేక కోర్టు గాలి సోమశేఖర్ రెడ్డి దోషి అని తేల్చింది. అక్రమంగా ఆయుధాలు పెట్టుకున్నారని సంవత్సరం జైలు శిక్ష విధించవలసి ఉంటుందని, అయితే శిక్షకు బదులుగా సోమేశేఖర్ రెడ్డికి పలు షరుతులు విధించి విడుదల చేస్తున్నామని, షరతులు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Lovers: రివర్స్ గేర్ వేసిన గిరిష్మా, బ్లాక్ మెయిల్ చేశాడని లేపేశాను, కోటీశ్వురుడిని పెళ్లి చేసుకోవాలని స్కెచLovers: రివర్స్ గేర్ వేసిన గిరిష్మా, బ్లాక్ మెయిల్ చేశాడని లేపేశాను, కోటీశ్వురుడిని పెళ్లి చేసుకోవాలని స్కెచ

 అక్రమంగా రివాల్వర్ పెట్టుకున్నారని

అక్రమంగా రివాల్వర్ పెట్టుకున్నారని

కర్ణాటక మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, బళ్లారికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి అక్రమంగా రివాల్వర్ దగ్గర పెట్టుకున్నారని 2013లో ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. 2009లో రివాల్వర్ అవది పూర్తి అయినా 2010, 2011లో రివాల్వర్ కు రెన్యువల్ చెయ్యలేదని గాలి సోమశేఖర్ రెడ్డి మీద కేసు నమోదు అయ్యింది.

 కోర్టులో కేసు విచారణ

కోర్టులో కేసు విచారణ

కర్ణాటక ఎమ్మెల్యేలు, ఎంపీల మీద నమోదు అయిన కేసులు విచారణ చేస్తున్న ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టు గాలి సోమశేఖర్ రెడ్డి కేసును విచారణ చేసింది. పని ఒత్తిడితో, రాజకీయ కార్యకలాపాలతో తాను తన దగ్గర ఉన్న రివాల్వర్ రెన్యువల్ చేసుకోలేకపోయానని బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి కోర్టుకు చెప్పారు.

 సోమశేఖర్ రెడ్డి ఏం చెప్పారంటే ?

సోమశేఖర్ రెడ్డి ఏం చెప్పారంటే ?

ఇంటిని మరమత్తులు చేసే సమయంలో రివాల్వర్ రెన్యువల్ లెటర్ పోయిందని, అందు వలన ఎప్పుడు రెన్యువల్ చేసుకోవాలో తేదీ తెలీక తాను రెన్యువల్ చేసుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి కోర్టుకు చెప్పారు. కేసు విచారణ చేసిన ప్రత్యేక కోర్టు బళ్లారి బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి అక్రమంగా రివాల్వర్ దగ్గర పెట్టుకుని తప్పు చేశారని, ఆయన దోషి అని తేల్చింది.

 జైలు శిక్షకు బదులుగా షరతులు పెట్టిన కోర్టు

జైలు శిక్షకు బదులుగా షరతులు పెట్టిన కోర్టు

అక్రమంగా ఆయుధాలు పెట్టుకున్నారని సంవత్సరం జైలు శిక్ష విధించవలసి ఉంటుందని కోర్టు చెప్పింది. అయితే ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డికి శిక్షకు బదులుగా పలు షరుతులు విధించి విడుదల చేస్తున్నామని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, ప్రతిమూడు నెలలకు ఒకసారి కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు సూచించింది.

 షరతులు ఉల్లంఘిస్తే ?

షరతులు ఉల్లంఘిస్తే ?

శాంతికి భంగం కలిగించే పనులు చెయ్యకూడదని, శాంతిని కాపాడాలని సూచిస్తూ రూ. 50,000 పూచికత్తు బాండుతో బళ్లారి బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డిని కోర్టు విడుదల చేసింది. షరతులు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

English summary
MLA: Unlawful possession of revolver: Bengaluru Special Court convicted Bellary BJP MLA Gali Somashekar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X