ఈవీఎంలపై వినూత్న పోరు: రాన్రాను రసవత్తరం..!!
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. 10 రోజుల పాటు ఎడతెగకుండా సాగిన ముఖ్యమంత్రి అభ్యర్థి హైడ్రామాకు తెరపడినప్పటికీ- మరో పోరు అక్కడ మొదలైంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలోని మహాయుటి సర్కార్‌ను ఉక్కిరి బిక్కిరి చేసే దిశగా తాజా పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ బహిష్కరించడం అనూహ్య పరిణామం. కొత్త శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాలు ఇవి. దీన్ని బాయ్‌కాట్ చేసింది. అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయదలచుకోలేదని ప్రకటించింది.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లల్లో మోసాలకు పాల్పడటం వల్లే మహాయుటి అధికారంలోకి వచ్చిందంటూ అఘాడీ నాయకులు ఆరోపిస్తోన్నారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ పెద్దలు ఖూనీ చేశరాంటూ నిప్పులు చెరుగుతున్నారు. తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోన్న మహాయుటి మరోసారి అధికారంలోకి రావడానికి ఈవీఎంలే కారణమంటూ విమర్శలు చేస్తోన్నారు.
ఈవీఎంలల్లో జరిగిన మోసాలను నిరసిస్తూ తాము ప్రమాణ స్వీకారం చేయదలచుకోలేదని మహా వికాస్ అఘాడీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి ఆదిత్య థాకరే ప్రకటించారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని ధ్వజమెత్తారు. మహాయుటి సర్కార్‌ను ఈవీఎం ప్రభుత్వంగా అభివర్ణించారాయన.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 149 సీట్లల్లో పోటీ చేసి 132 చోట్ల గెలిచింది బీజేపీ. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి. దీనిపై మహా వికాస్ అఘాడీ మొదటి నుంచీ పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ వస్తోంది.
స్వయంగా శరద్ పవార్ ఈ ఫలితాలపై స్పందించారు అప్పట్లో. మోసం జరిగిన మాట వాస్తవమేనని, దీనిపై ఎలాంటి సాక్ష్యాధారాలు ఉండట్లేదని ఆయన వాపోయారు. ఈవీఎంల ద్వారా మహాయుటి అధికారంలోకి వచ్చిందంటూ ఆక్షేపించారు. ఈ ఎన్నికలు వాస్తవ ప్రజా తీర్పునకు అద్దం పట్టలేదని అన్నారు.
మహా వికాస్ అఘాడీ 46 నియోజకవర్గాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇందులో శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) వర్గం- 20, కాంగ్రెస్- 16, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) 10 చోట్ల విజయం సాధించింది. తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇంత భారీ మెజారిటీతో గెలవడం అసాధ్యమంటూ మహా వికాస్ అఘాడీ చెబుతోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications