ఎమ్మెల్యేలు పార్టీలోకి రావొచ్చు: లాలూకు నితీష్ షాక్

ఆ తర్వాత సాయంత్రం అందులో తొమ్మిది మంది తాము ఆర్జేడిలోనే ఉంటామని ప్రకటించారు. మిగతా ఎమ్మెల్యేలు జెడి(యు)లో చేరేందుకు సిద్ధమయ్యారు. దీనిపై లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీలో చీలిక తెచ్చి, వారి వైపు తీసుకెళ్తున్నారని లాలూ ఆరోపించారు. నితీష్ సూచన మేరకే స్పీకర్ ఎమ్మెల్యేలను ప్రత్యేక కూటమిగా గుర్తించారని ఆరోపించారు.
కాగా, ప్రత్యేక కూటమిగా గుర్తించాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖను ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తన కోరిక మేరకే పరిగణనలోనికి తీసుకుని తనకు అనుగుణంగా పని చేశారన్న ఆరోపణలను నితీష్ కుమార్ ఖండించారు.
లాలూకు, ఎమ్మెల్యేలకు మధ్య విడిపోయే స్థాయిలో విభేదాలున్నాయన్నారు. పార్టీ స్టాండ్ మేరకు ఎవరయినా వస్తానంటే పార్టీ తప్పకుండా ఆహ్వానిస్తుందన్నారు. థర్డ్ ఫ్రంట్ సమావేశానికి హాజరయ్యేందుకు నితీష్ కుమార్ ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల చేరిక, లాలూ ప్రసాద్ ఆరోపణలపై స్పందించారు.












Click it and Unblock the Notifications