Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముంబైలో సెక్స్ రాకెట్ బట్టబయలు... మోడల్ అరెస్ట్... టీవీ ఆర్టిస్టులతో వ్యభిచార దందా...

ముంబైలో మరో సెక్స్ రాకెట్ బట్టబయలైంది. జుహు ప్రాంతంలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఓ మోడల్‌(32)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హోటల్‌పై అకస్మిక దాడులు నిర్వహించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. టీవీ నటులు,మోడల్స్‌ను ఆమె బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్లు గుర్తించారు.

తాజా దాడుల్లో ఓ యువతికి పోలీసులు విముక్తి కల్పించారు. మోడల్,టీవీ నటి అయిన ఆమె గతంలో ఓ సోప్ యాడ్‌లో నటించినట్లు తెలిపారు. అరెస్టయిన మోడల్ పలువురు నటీమణులు,మోడల్స్‌తో బలవంతంగా డీల్ కుదుర్చుకుని సెక్స్ రాకెట్‌ నిర్వహిస్తున్నట్లు నిర్దారించారు. విచారణలో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.

model allegedly running sex racket in mumbai arrested by police

ఓవైపు రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసుపై విచారణ జరుగుతుండగానే తాజాగా ముంబైలో మరో సెక్స్ రాకెట్ బయటపడటం చర్చనీయాంశంగా మారింది. జులై 19న ముంబై పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసిన‌ సంగతి తెలిసిందే.పోర్న్ చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇందులో రాజ్‌ కుంద్రా పాత్ర కీలకంగా ఉందని నిర్దారించామన్నారు. 'ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో ఫిబ్రవరి,2021లో పోర్న్ చిత్రాలకు సంబంధించి కేసు నమోదైంది. పోర్న్ చిత్రాల నిర్మాణం,పలు యాప్స్‌లో వాటిని అప్‌లోడ్ చేసిన కారణంగా ఈ కేసు నమోదు చేశాం. ఇందులో రాజ్‌కుంద్రా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించి అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.' అని రాజ్‌కుంద్రా అరెస్ట్ సందర్భంగా ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ వ్యవహారంపై కొద్దిరోజుల మౌనం తర్వాత ఆయన భార్య,నటి శిల్పాశెట్టి నోరు విప్పిన సంగతి తెలిసిందే. రాజ్‌కుంద్రా నిర్మించినవి ఎరోటిక్ చిత్రాలని,అశ్లీల చిత్రాలు కాదని శిల్పా పేర్కొనడం గమనార్హం.పోర్న్ రాకెట్ కేసు విచార‌ణ‌లో ఉంద‌ని, ముంబై పోలీసులతో పాటు న్యాయ‌వ్య‌వ‌స్ధ ప‌ట్ల త‌న‌కు పూర్తి విశ్వాసం ఉంద‌ని చెప్పారు. ఓ కుటుంబంగా తాము న్యాయ‌ప‌ర‌మైన ప‌రిష్కారాల కోసం అన్వేషిస్తున్నామ‌ని, ఓ త‌ల్లిగా త‌మ కుటుంబం, పిల్ల‌ల గోప్య‌త‌ను గౌర‌వించి అర్ధ‌స‌త్యాలు, అస‌త్యాల‌ను ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Recommended Video

    Sonu Sood Meets Crowd Of People Hoping For Help At Outside Of His House | Oneindia Telugu

    గ‌త 29 ఏండ్లుగా తాను దేశ చ‌ట్టాల‌ను గౌర‌విస్తూ క‌ష్టించి ప‌నిచేసే ప్రొఫెష‌న‌ల్‌గా ఉన్నాన‌ని అన్నారు. మీడియా విచార‌ణ‌ను తాము కోరుకోవ‌డం లేద‌ని, చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకునేలా మ‌నం వ్య‌వ‌హ‌రించాల‌ని... స‌త్య‌మేవ జ‌య‌తే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+