ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్: నిజమైన తల్లి కోసం ప్రయత్నిస్తే.. ఆనందంగా ఒప్పుకున్న మోడల్
Recommended Video

తిరువనంతపురం: మలయాళ మేగజైన్ గృహలక్ష్మిపై కేసు నమోదయిన విషయం తెలిసిందే. అలాగే, కవర్ పేజీ కోసం నిజమైన తల్లిని ఎందుకు పెట్టలేదనే విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఎడిటర్ ఇన్ చీఫ్ మాన్సీ జోసెఫ్ మాట్లాడుతూ.. కవర్ పేజీ కోసం నిజమైన తల్లి చిత్రాన్ని ప్రచురించేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యామని చెప్పారు.

నిజమైన తల్లి ఫోటోను కథనంలో ప్రచురించాం
అయితే ఆ బిడ్డకు పాలు ఇస్తున్న నిజమైన తల్లి ఫోటోను కవర్ స్టోరీ కథనంలో ప్రచురించామని మాన్సీ జోసెఫ్ చెప్పారు. కవర్ ఫోటోపై ఆ ఫోటోను ప్రచురించడం సామాన్య విషయం కాదని చెప్పారు.

అది సామాన్యమైన విషయం కాదు
నిజమైన తల్లి ఫోటోను ప్రచురించడం అసామాన్యమని, ఏ ప్రయత్ని ఫలించని పరిస్థితుల్లోనే చివరకు మోడల్ గిలు జోసెఫ్‌ను సంప్రదించామని, ఆమె ఆనందంగా ఒప్పుకుందని మాన్సీ జోసెఫ్ తెలిపారు.

ఏ దృష్టి కోణంతో చూస్తే అలా
మహిళ వక్ష స్థలాన్ని ఎలాంటి అచ్చాదన లేకుండా చూపించారనే విమర్శలపై కూడా ఆయన స్పందించిన విషయం తెలిసిందే. ఏ దృష్టికోణంతో ఆ పోటో చూస్తే అది అలా కనిపిస్తుందని, కేవలం ఫోటో ప్రచురణని వ్యతిరేకించడం వల్ల అసలు సమస్య అనేది అబద్దం కాకుండా పోదన్నారు.

బ్రెస్ట్ ఫీడింగ్ పైన
పబ్లిక్ మధ్య తమ బిడ్డలకు బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం మన దేశంలో తగ్గుతోందని, ఈ నేపథ్యంలో దానిపై అవగాహన పెంచేందుకు ఈ ప్రయత్నం చేశామని ఎడిటర్ చెప్పారు. పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు తల్లులు కచ్చితంగా తమ పిల్లలకు చనుబాలు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. కానీ చాలా వరకు ప్రపంచ దేశాల్లో పబ్లిక్ బ్రెస్ట్ ఫీడింగ్ ఓ వివాదంగా ఉంది. స్కాట్లాండ్‌లో పబ్లిక్ బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల చాలామంది తల్లులు ఇబ్బందికరంగా ఫీలవుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. యూకేలో గత ఏడాది బ్రెస్ట్ ఫీడింగ్ అత్యల్పంగా ఉన్నట్లు ఓ స్టడీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications