Models: బైక్ తప్పించి చెట్టును ఢీకొట్టిన కారు, మిస్ కేరళ 2019, రన్నర్ విన్నర్ దుర్మరణం, రాత్రి !
తిరువనంతపురం: మిస్ కేరళ కిరిటాన్ని సొంతం చేసుకున్న యువతి, రన్నరప్ గా నిలిచిన యువతి ఒకే సారి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మిస్ కేరళ కిరీటాన్ని సొంతం చేసుకున్న యువతి తరువాత మోడల్ గా రాణిస్తోంది. మోడల్ గా మంచి పేరు తెచ్చుకున్న ఇద్దరు యువతులు రాత్రి ఫోటో సెషన్ కు హాజరైనారు. ఫోటో సెషన్ పూర్తి అయిన తరువాత కారులో వెలుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మోడల్స్ దుర్మరణం చెందడంతో ఆమె అభిమానులు ఉలిక్కిపడ్డారు.

2019 మిస్ కేరళ, రన్నర్
2019లో కేరళలో మిస్ కేరళ అందాల పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో చాలా మంది యువతులు వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2019లో కేరళ మిస్ అందాల పోటీల్లో తిరువనంతపురంకు చెందిన యాన్సి కబీర్ విన్నర్ కిరీటం సొంతం చేసుంది. యాన్సి కబీర్ మిస్ కేరళ కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో త్రిసూర్ కు చెందిన అంజానా షాజాన్ రన్నర్ కిరీటం సొంతం చేసుకుంది.

ఆరోజే ఇద్దరికి పరిచయం
2019లో మిస్ కేరళ కిరీటాన్ని యాన్సి కబీర్, రన్నర్ కిరీటాన్ని అంజానా షాజన్ సొంతం చేసుకున్న సమయంలోనే ఇద్దరికి పరిచయం అయ్యింది. మిస్ కేరళ కిరీటాన్ని సొంతం చేసుకున్న యాన్సి కబీర్ తరువాత మోడల్ గా రాణిస్తోంది. మోడల్ గా మంచి పేరు తెచ్చుకుంటున్నది. మిస్ కేరళ రన్నర్ సంజానా షాజన్ కూడా మోడలింగ్ లో రాణిస్తున్నది.

రాత్రి మొత్తం ఫోటో సెషన్
యాన్సి కబీర్, సంజానా షాజన్ మోడల్స్ గా పోటీలో ఉన్నా ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆదివారం రాత్రి కొచ్చిలో యాన్సి కబీర్, సంజానా షాజన్ ఫోటో సెషన్ లో పాల్లొన్నారు. ఫోటో సెషన్ పూర్తి అయిన తరువాత యాన్సి కబీర్, సంజానా షాజన్ తదితరులు కారులో బయలుదేరారు. అదే రోజు ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని వారు ఊహించలేకపోయారు.

బైక్ ను తప్పించి చెట్టుకును ఢీకొట్టిన కారు
సోమవారం వేకువ జామున యాన్సి కబీర్, సంజానా షాజాన్ ప్రయాణిస్తు కారు వైటిళ్ల-ఎడవళ్లిలోరని ఎన్ హెచ్ 66లో వెలుతున్న సమయంలో ఓ బైక్ వేగంగా వచ్చింది. బైక్ ను తప్పించే ప్రయత్నంలో కారు వేగంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన మోడల్స్ యాన్సి కబీర్, సంజానా షాజాన్ ప్రాణాలు సంఘటనా స్థలంలోనే గాలిలో కలిసిపోయాయి.

మోడల్స్ ఫ్రెండ్స్ కు తీవ్రగాయాలు
యాన్సి కబీర్, సంజానా షాజాన్ ఇద్దరి మృతదేహాలను ఎర్నాకుళం మెడికల్ కాలేజ్ కు తరలించారు. ఇదే ప్రమాదంలో కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలైనాయని, ఇద్దరిని తిరువనంతపురంలోని ఆసుపత్రికి తరలించామని పోలీసులు అన్నారు. విషయం తెలుసుకున్న యాన్సీ కబీర్, సంజానా షాజాన్ కుటుంబ సభ్యులు కొచ్చి చేరుకుని ఆర్తనాదాలు చేశారు.












Click it and Unblock the Notifications