పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.. లోక్ సభ స్పీకర్ ఎంపిక అప్పుడే!!

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో మళ్లీ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మూడవసారి ఎన్డీఏ సర్కార్ దేశాన్ని పాలించనుంది. భారత ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారు. మోడీ 3.0 మంత్రివర్గం కూర్పు కూడా పూర్తి కాగా, మంత్రులందరూ పరిపాలనకు సిద్ధమయ్యారు.

మోడీ 3.o పాలన షురూ
మొత్తం ఎన్డీఏ ప్రభుత్వంలో 71 మంది ఎంపీలకు మంత్రులుగా అవకాశం దక్కింది. ఇక మంత్రులు అందరికీ కూడా తమ తమ శాఖల కేటాయింపు కూడా పూర్తయింది. గత రెండు పర్యాయాలు చూసిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమే అని సినిమా ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పిన మోదీ తన టీమ్ తో పని మొదలు పెట్టనున్నారు. మోడీ 3.o పాలన మొదలు కానుంది.

Modi 3 o special Parliament session from june 24th interest over the Speaker selection

జూన్ 24వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు ప్రత్యేక సమావేశాలు
ఈ క్రమంలోనే లోక్ సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్ ను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాలలో లోక్సభ స్పీకర్ ఎన్నికతోపాటు, కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం కూడా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో జూన్ 24వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

జూన్ 26వ తేదీన లోక్సభ స్పీకర్ ఎన్నిక
మొత్తం ఎనిమిది రోజులపాటు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో జూన్ 24, 25 తేదీలలో కొత్త పార్లమెంటు సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ 26వ తేదీన లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే రెండు పర్యాయాల పాటు లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా పనిచేసిన విషయం తెలిసిందే.

స్పీకర్ పదవి కోసం పోటీలో ఉన్న కూటమి పార్టీలు
ఇక ఈ దఫా మాత్రం లోక్సభ స్పీకర్ పదవి పైన ఎన్డీఏ కూటమి పార్టీలు తమవారికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. టీడీపీ, ఏపీ బీజేపీతో పాటు, జెడియు స్పీకర్ పదవి పైన ఆశలు పెట్టుకున్నాయి. ఈనెల 26వ తేదీన 18వ లోక్ సభను నిర్వహించే స్పీకర్ పదవి ఎవరిది అన్నది తేలిపోనుంది. స్పీకర్ పదవిపై రాజకీయ వర్గాలలోనే కాదు ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+