విషం చిమ్మడమంటే: 'టి'తో సోనియాకు మోడీ కౌంటర్
సూరత్: అధికార కాంగ్రెసు పార్టీ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్య ద్వేషభావాన్ని రగిలించిందని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శనివారం అన్నారు. ఎపిలో కాంగ్రెస్ పార్టీ విషబీజాలు నాటుతోందని మోడీ ధ్వజమెత్తారు.
మోడీ విషం చిమ్ముతున్నారని గతంలో ఏఐసిసి అధ్యక్షులాలు సోనియా గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే. దీనికి మోడీ ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. సూరత్‌లో 'వికాస్ జ్యోతి యాత్ర' ప్రారంభోత్సవంలో మోడీ ప్రసంగించారు. తాను విషం చిమ్ముతున్నారంటూ కొందరు సినిమా డైలాగులు చెప్పారని కానీ, ప్రేమను పంచేదెవరు? విషం చిమ్మేదెవరు? అనే విషయం ప్రజలకు చెప్పాలనుకుంటున్నానని, అటల్ బిహారీ వాజపేయి వాజపేయి ప్రధానిగా ఉండగా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశామని, అప్పుడు అందరూ ఆనందంగా మిఠాయిలు పంచుకున్నారని తెలిపారు.

ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందో చూడాలన్నారు. కేవలం కొన్ని ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలను బాధిస్తోందని, వారిని తెలంగాణ ప్రజలకు వ్యతిరేకులుగా మార్చిందని, అలాగే తెలంగాణ ప్రజలు సీమాంధ్రులను వ్యతిరేకులుగా భావిస్తున్నారని, కాంగ్రెస్ కారణంగా మొత్తం ఎపి మండుతోందని, దీనినే విష బీజాలను నాటడమని అంటారని అన్నారు.
నాడు వాజపేయి ప్రేమ విత్తనాలు నాటితే, నేడు కాంగ్రెస్ విద్వేషాలను పెంచుతోందని మండిపడ్డారు. దేశాన్నే అమ్ముకుందని మోడీ ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు దేశాన్ని బలి చేసిందని, విద్వేషాలు, మత విభేదాలు, పేదరికాన్ని వృద్ధి చేసిందన్నారు.












Click it and Unblock the Notifications