మోడీకి పెరుగుతున్న ఆదరణ, 70 శాతం మంది మళ్లీ కావాలంటున్నారు

న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీయే కావాలని 70 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారు. తాజాగా ప్రధానమంత్రిగా మోడీ పని తీరుపై ఓ ఆన్ లైన్ సర్వే నిర్వహించారు. ఇందులో మెజార్టీ ప్రజలు మోడీకే పట్టం కట్టారు.

తద్వారా ప్రధాని మోడీకి దేశంలో ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోందని అర్థమవుతోంది. రెండున్నరేళ్ల మోడీ పాలనపై సంతృప్తి వ్యక్తమవుతోంది. దేశంలోని డెబ్బై శాతం మంది ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపడం గమనార్హం.

Modi as PM in 2019: 70 per cent Indians say 'yes', claims fresh survey

2019లో భారత దేశ ప్రధాని అనే అంశంపై యూత ఆఫ్‌ ది నేషన్‌(దేశ యువత) పేరుతో నిర్వహించిన తాజా సర్వేలో మెజారిటీ జనాభా మోడీని తిరిగి ప్రధాని పీఠంపై చూడాలని ఉవ్వీళ్లూరుతున్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోల్‌ ద్వారా తదుపరి ప్రధానిపై ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

మోడీకి 64 శాతం మంది మహిళలు మద్దతిచ్చారు. దేశంలో యాభై శాతం మందికి పైగా లిక్కర్‌ను బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు. కాలేజీల్లో రాజకీయాలు ఉండవద్దా అనే ప్రశ్నకు 61 శాతం మంది అవునని, 32 శాతం మంది నో అని చెప్పారు. ఈ సర్వేను జూలై 25వ తేదీ నుంచి ఆగస్టు 7వ తేదీ మధ్య చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+