నెల రోజుల్లో మోదీ మాజీ ప్రధాని..! ఔరంగాబాద్ లో ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..!!
Recommended Video
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి రెచ్చిపోయారు. మోదీ మాటలకు, చేతలకు అంతులేనంత అంతరం ఉంటుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఓ వైపు ఉగ్రవాద నిరోధం, దేశభద్రత గురించి అద్భుతమైన మాటలు వల్లె వేస్తారని, మరోవైపు ఉగ్రదాడుల్లో నిందితులకే తమ పార్టీ తరపున టికెట్లు ఇచ్చి నిలబెడతారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపి పార్టీ పై విమర్శనాస్త్రాలు సంధించారు ఒవైసీ.

ఈ సందర్భంగా మోదీపై ఎప్పటిలాగే విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం నిరోధం గురించి ఉపన్యాసాలు దంచేస్తున్న మోదీ మాలేగావ్ పేలుళ్ల ద్వారా ఆరుగురు అమాయకుల ప్రాణాలను బలిగొన్న కేసులో నిందితురాలు సాద్వి ప్రగ్యాసింగ్ థాకూర్‌కు బీజేపీ టికెట్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాదంపై పోరాడుతున్నట్టు చెప్పడం హాస్యాస్పదమన్నారు. మోదీ కల్లబొల్లి మాటలు దేశ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆయన నెలరోజుల్లో మాజీ కావడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications