మోడీ కేబినెట్లోకి కొత్తగా వీరే..! తొలగింపులు ఖరారు-తాజా ముహుర్తం ఫిక్స్..!

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు (Cabinet Reshuffle) రంగం సిద్దమవుతోంది. అయితే ఇప్పటివరకూ అనుకుంటున్న దానికి భిన్నంగా ఈ నెలాఖరుకు బదులు వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఇది జరిగే అవకాశం ఉంది. మరోవైపు అదే సమయంలో అధికార పార్టీ బీజేపీలోనూ కీలక మార్పులు జరగబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీలోనూ ఒకేసారి మార్పులు ఉండబోతున్నాయి. దీంతో ఈసారి కేబినెట్ ప్రక్షాళన దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలపై ప్రభావం చూపబోతోంది.

జూలై మూడవ వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దానికి కాస్త ముందు కేబినెట్ మార్పులు ఉంటాయని సమాచారం. అలాగే నితిన్ నబిన్ నేతృత్వంలో బీజేపీ కొత్త సంస్థాగత బృందాన్ని ప్రకటించడంతో పాటు ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉంది. బీజేపీ అగ్ర నాయకత్వం ఈ జాబితాను ఇప్పటికే ఖరారు చేసింది. ఇందులో బీజేపీలో పలువురు యువ నేతలకు కీలక పదవులు అప్పగించబోతున్నారు.

Modi Cabinet Reshuffle 2026 BJP Organisational Revamp Also Likely Before Monsoon Session Probables List

కొందరు కేంద్ర మంత్రులను బీజేపీలోని సంస్థాగత పదవుల్లోకి బదిలీ చేయడానికి, పార్టీ కార్యనిర్వాహకులను మోదీ ప్రభుత్వంలోకి తీసుకోవడానికి బలమైన అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పించడం, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖ అప్పగించి, ఆమె శాఖకు మంత్రిగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ను తీసుకురావడం, అనురాగ్ ఠాకూర్ ను తిరిగి కేబినెట్లోకి తీసుకోవడం వంటి మార్పులు చేయబోతున్నారు.

ప్రధానమంత్రి మోదీ జూన్ 27 నుండి 29 వరకు సీషెల్స్‌లో మూడు రోజుల పర్యటనలో ఉండబోతున్నారు. జూలై 6 నుండి 11 మధ్య ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వెళ్తారు. జపాన్ నేత సనాయే తకైచి జూలై 1 నుండి 3 వరకు న్యూఢిల్లీని సందర్శిస్తారు. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ఖరారు చేస్తారు. పరీక్షల లీకేజీలు, ఆర్దిక సంక్షోభం నేపథ్యంలో కొన్ని కీలక శాఖలకు కొత్త రక్తం అవసరమని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రాను ఇప్పటికే బీజేపీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ విభాగాల అధ్యక్షులుగా పంపారు. మరో ఇద్దరు కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టుకు రాజ్యసభ నిరాకరించారు. దీంతో జార్జ్ కురియన్ రాజీనామా కూడా చేశారు. బిట్టూను పంజాబ్ పై ఫోకస్ పెట్టాలని మోడీ సూచించారు.

A cabinet reshuffle is likely before the Monsoon Session of Parliament with a BJP organisational revamp also expected Here is a look at the key probables and what the changes could mean

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ, పంజాబ్ నుండి మరికొంతమందిని కేబినెట్లోకి తీసుకుంటారు. బెంగాల్‌లో బీజేపీ ఘనవిజయం నేపథ్యంలో అక్కడి ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కవచ్చు. చీలికల నేపథ్యంలో టీఎంసీ, శివసేన రెబెల్స్ లో ఒకరిద్దరిని కేబినెట్లోకి తీసుకోబోతున్నారు. అలాగే షిండే కుమారుడు శ్రీకాంత్ కు కూడా కేబినెట్లో చోటు దక్కవచ్చు. ఆప్ రెబెల్ ఎంపీల్లో రాఘవ్ చద్దా లేదా అశోక్ మిట్టల్ కు ఛాన్స్ ఉంది. త్వరలో ముగ్గురు గవర్నర్లు థావర్‌చంద్ గెహ్లాట్ (కర్ణాటక), మంగుభాయ్ పటేల్ (మధ్యప్రదేశ్), లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (ఉత్తరాఖండ్) పదవీకాలం కూడా ముగియనుంది. వీరి స్ధానాల్లో కేబినెట్లో తప్పించిన వారికి ఛాన్స్ ఇస్తారని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+