వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Modi Cabinet 2.0 : ప్రమోషన్ కొట్టిన ఆ ఏడుగురు మంత్రులు వీరే...

|
Google Oneindia TeluguNews

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఏడుగురు మంత్రులకు ప్రమోషన్ లభించింది. ఇదివరకు సహాయ మంత్రులుగా ఉన్న వీరికి తాజాగా కేబినెట్ బెర్తులు దక్కాయి. వీరిలో తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డితో పాటు ఇదివరకు సహాయమంత్రులుగా పనిచేసిన కిరణ్ రిజిజు,అనురాగ్ సింగ్ ఠాకూర్,హర్‌దీప్ సింగ్,పరశోత్తమ్ రూపాలా,మన్సుఖ్ మాండవియా,ఆర్కే సింగ్ ఉన్నారు. బుధవారం(జులై 7) రాత్రికి కొత్త మంత్రుల శాఖలు ఖరారయ్యే అవకాశం ఉంది.

కిషన్ రెడ్డి...

కిషన్ రెడ్డి...

తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి... హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ నుంచి 2004లో మొదటిసారి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన... ఆ తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి గెలుపొందారు. ఆ వెంటనే కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. తాజా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కిషన్ రెడ్డి సహాయమంత్రి నుంచి కేబినెట్ హోదా దక్కించుకున్నారు. కేంద్రం కొత్తగా తీసుకురాబోతున్న సహకార మంత్రిత్వ శాఖను కిషన్ రెడ్డికే అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కిరణ్ రిజిజు...

కిరణ్ రిజిజు...

అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ అయిన కిరణ్ రిజిజు 2014 నుంచి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. మోదీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్రంలో హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కేంద్ర క్రీడాశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. తాజాగా ఆయనకు కేంద్ర కేబినెట్ హోదా దక్కింది.

అనురాగ్ సింగ్ ఠాకూర్

అనురాగ్ సింగ్ ఠాకూర్


హిమాచల్ ప్రదేశ్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ గతంలో బీజేవైఎం అధ్యక్షుడిగా పనిచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర ఆర్థిక శాఖ,కార్పోరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా నియమితులయ్యారు. తాజా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో అనురాగ్ ఠాకూర్‌కు కేంద్ర కేబినెట్ హోదా దక్కింది. హిమాచల్ ప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లో ఆయనకు చోటు కల్పించారు.

హర్‌దీప్ సింగ్ పురి

హర్‌దీప్ సింగ్ పురి

పంజాబ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత హర్‌దీప్ సింగ్ పురి... గతంలో కేంద్ర హౌసింగ్,పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర పౌర విమానయాన సహాయమంత్రిగా పనిచేశారు.వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హర్‌దీప్ సింగ్‌కు తాజాగా ప్రమోషన్ కల్పించారు. కేబినెట్‌లో కొత్తగా చోటు దక్కిన 43 మందిలో హర్‌దీప్ సింగ్ కూడా ఉన్నారు.

పరశోత్తమ్ రూపాలా...

పరశోత్తమ్ రూపాలా...


గుజరాత్‌ రాజ్యసభ ఎంపీ పరశోత్తమ్ రూపాలా 2019 నుంచి కేంద్ర కేబినెట్‌లో పంచాయతీరాజ్ శాఖ సహాయమంత్రిగా కొనసాగుతున్నారు. గతంలో గుజరాత్ ఎమ్మెల్యేగా,రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తాజాగా కేంద్ర కేబినెట్‌లో ఆయనకు బెర్త్ దక్కింది.

మన్సుఖ్ మాండవియా

మన్సుఖ్ మాండవియా


గుజరాత్ ఎంపీ మన్సుఖ్ మాండవియా కేంద్ర పోర్టులు,షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. రసాయనాలు,ఎరువుల శాఖ సహాయమంత్రిగానూ పనిచేశారు. అంతకుముందు,2014 నుంచి 2019 వరకు రోడ్డు రవాణా శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.తాజా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కేంద్ర కేబినెట్ బెర్త్ దక్కించుకున్నారు.

ఆర్కే సింగ్...

ఆర్కే సింగ్...

ఆర్కే సింగ్ 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు 2013లో బీజేపీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని అరాహ్ నుంచి గెలుపొందారు. బీజేపీ కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చాక సహాయమంత్రిగా పనిచేశారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయనకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది.

Recommended Video

#Article370: Jammu and Kashmir - Modi All Party Meet | Elections | Oneindia Telugu

English summary
Seven ministers have been promoted in the central cabinet reshuffle. Ministers of state (MoS) have been elevated to the rank of cabinet ministers. Among them are Kishan Reddy from Telangana, Kiran Rijiju, Anurag Singh Thakur, Hardeep Singh, Parashottam Rupala, Mansukh Mandavia and RK Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X