వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిపై మోడీ, అమితాబ్‌నూ వదల్లేదు: 'సుష్మ కళ్లలో నీళ్లు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

సిమ్లా/న్యూఢిల్లీ: జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఇరు ప్రాంతాల్లోను ప్రజలు మిఠాయిలు పంచుకున్నారని, అదే కాంగ్రెసు ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అన్నదమ్ముల్లా ఉన్న వారిని కొట్టుకునే వరకు తీసుకు వచ్చిందని, చిచ్చు పెట్టిందని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. హిమాచల్ ప్రదేశ్ సుజాన్‌‍పుర్ పరివర్తన్ సభలో మోడీ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హిమాల్ ప్రదేశ్ వీరుల భూమి అన్నారు. దేశ సేవలో హిమాచల్ యువత పాత్ర కీలకమన్నారు. హిమాచల్ ప్రదేశఅ అంటే అటల్ బిహారీ వాజపేయికి ఎంతో ఇష్టమని చెప్పారు. ధరల నియంత్రణలో యూపిఏ పూర్తిగా విఫలమైందని, వంద రోజుల్లో ధరలు తగ్గిస్తానని మాటిచ్చిన యూపిఏను వంద రోజుల్లో ఇంటికి పంపించాల్సి ఉందన్నారు. యూపిఏ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు.

Modi changes NDA's description ahead of Lok Sabha election

కాంగ్రెసు అహంకారూపూరితంగా, జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. తప్పులను ఒప్పుకునే సంస్కారం కూడా ఆ పార్టీకి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెసు పెద్దలను ప్రజలు నమ్మడం లేదన్నారు. మీరు మద్దతిస్తే రుణం తీర్చుకుంటానన్నారు. బిజెపి అధికారంలకి వస్తే హిమాలయ రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకు వస్తామన్నారు. చాయ్ వాలా గాలి వీస్తోందని, అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.

రాజకీయాల్లో అంటరానితనాన్ని కాంగ్రెసు పార్టీ పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. సిపిఎం నేత ఒకరు తనను పొగిడినందుకు అతనిని పార్టీ నుండి తొలగించారని, కేరళ మంత్రి ఒకరు తనను కలిస్తే అతనిని ప్రశ్నించారని ఇవేం రాజకీయాలన్నారు. గుజరాత్‌కు అంబాసిడర్‌గా ఉన్న అమితాబ్ బచ్చన్‌ను సైతం వదల్లేదన్నారు.

లోకసభ ఘటనపై ఆద్వానీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెసు పార్టీ విఫలమైందని బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఢిల్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు వెల్లోకి చొచ్చుకు రావడం దిగ్భ్రాంతిని కలిగించిందని, పెప్పర్ స్ప్రే వల్ల సుష్మా స్వరాజ్ కళ్ల వెంట నీళ్లు వచ్చాయని తెలిపారు. తమ హయాంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినా శాంతిభద్రతలకు విఘాతం కలుగలేదన్నారు.

English summary
Changing the description of NDA from National Democratic Alliance to National Development Alliance, Modi asserted that BJP wants development and not empty promises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X