మోడీ కాపీ కొడుతున్నారు: ములాయం, అఖిలేష్ పైనా..

Modi copying my scheme of adopting villages, building toilets: Mulayam Singh
లక్నో: సమాజ్‌వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్‌లోని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పైన ఆదివారం మండిపడ్డారు. కొడుకు పాలన పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి నత్త నడకన సాగుతోందన్నారు. చాలా ప్రాజెక్టులు షెడ్యూల్ కంటే వెనుకబడి ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇంకా ఎంతో జరగాల్సి ఉందన్నారు.

గ్రామాలను దత్తత తీసుకుని, మరుగుదొడ్లను నిర్మించే విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను కాపీ కొడుతున్నారని ములాయం ఆరోపించారు. ప్రధానమంత్రి చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విమర్శించారు. పేదరికాన్ని తొలగిస్తే మురికి దానికదే అంతమవుతుందని వ్యాఖ్యానించారు.

మోడీ గ్రామాలను దత్తత తీసుకోవడం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని, తాను 1990లోనే గ్రామాలను దత్తత తీసుకున్నానని చెప్పారు. మోడీ తనను కాపీ కొడుతున్నారని, ఇదంతా తాను ఇది వరకే చేశానని చెప్పారు. తాను 1990లోనే మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టానని పేర్కొన్నారు.

ప్రధాని ఇప్పుడు చెబుతున్న వాటిని తాను 1990లోనే చేశాననే విషయాన్ని మీరు తెలుసుకొని ఉండాలని పార్టీ నాయకులను ఉద్దేశించి ములాయం అన్నారు. ప్రతి ఒక్కరు కనీసం రెండు గ్రామాలను దత్తత తీసుకొని, పూర్తి అంకితభావంతో వాటి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన మంత్రులు, చట్టసభల సభ్యులు సహా పార్టీ నాయకులను ఆదేశించారు.

తన జన్మదినోత్సవ కార్యక్రమాలకు భారీగా వ్యయం చేసినట్లు వచ్చిన విమర్శలను తిప్పికొడుతూ, వీటికి ప్రభుత్వ ధనాన్ని వ్యయం చేయలేదని ములాయం చెప్పారు.

ములాయం రెండు రోజుల క్రితం తన 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాంపూర్‌లో 75 అడుగుల పొడవు గల కేక్‌ను కట్ చేసిన విషయం తెలిసిందే. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాంపూర్‌లో రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి వినియోగించిన నిధులు ఎక్కడివని అనేక పార్టీలు ప్రశ్నించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+