Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీపై మమకారం, బీహార్ టు ఢిల్లీ, ఒంటిపై పెయింట్, చేతిలో ప్లాస్క్

న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగజ్జేతగా నిలిచి తిరిగి అధికారం చేపట్టిన నరేంద్ర మోడీకి అభిమానులు ఏం తక్కువ కాదు. ఆయనంటే అమితంగా ఇష్టపడే ఫ్యాన్స్ ఎక్కువే. కాసేపట్లో ఆయన పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని ఏకంగా బీహార్ నుంచి విచ్చేశాడు. రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో సంచరిస్తూ .. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాతే వెళతానని భీష్మించుకొని కూర్చొన్నారు.

వల్లమాలిన అభిమానం ..
ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తోన్న అతని పేరు అశోక్. బీహార్ లోని ముజఫర్ నగర్ స్వస్థలం. నరేంద్ర మోడీ అంటే మనోడికి చచ్చేంత ఇష్టం. ఇక ఈ ఫోటో చూస్తే ఇట్టే అర్థమవుతుంది. మోడీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ముజఫర్ నగర్ నుంచి ఢిల్లీ వచ్చారు. అశోక్ లో మరో విశేషముంది. ఇతను కూడా చాయ్ వాలానే. నరేంద్ర మోడీ కూడా ఛాయ్ అమ్మి ఈస్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. అచ్చం మోదీ లాగానే ఇతను కూడా ఛాయ్ విక్రయిస్తుండటం విశేషం. ఆ ప్రాంతంలో అశోక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారని స్థానికులు చెప్తున్నారు.

modi fan sell tea in swearing place

బీహర్ టు ఢిల్లీ
తాను ఆరాధించే నేతకు మద్దతు తెలిపేందుకు ముజఫర్ నగర్ నుంచి వచ్చాడు అశోక్. వచ్చి ఊరికే ఉండలేదు. తాను చేసే టీ విక్రయిస్తున్నాడు. అందరీలా టీ అమ్మితే ఏం బాగుంటుంది అనుకున్నాడో ఏమో కానీ .. ఒంటిపై మోడీ ఫోటో వేసుకున్నాడు. త్రివర్ణ పతాకం .. మధ్యలో మోడీ ఫోటో వేసుకొన్నాడు. దీంతో ప్రజలంతా అతనిపై ఫోకస్ చేశారు. అతనికీ అనుకున్న దానికంటే ఎక్కువ టీ విక్రయం జరుగుతుంది కూడా. మోడీ ప్రమాణ స్వీకారం పూర్తయ్యేవరకు ఇక్కడే ఉంటానని చెప్పారు. అప్పటివరకు ఇక్కడికి వచ్చేవరికి టీ ఇస్తానని చెప్తున్నాడు. మోడీ అభిమాని .. ఒంటిపై అతని ఫోటోతో పెయింట్ వేసుకొని టీ విక్రయించడం అందరినీ ఆకట్టుకుంది. నమోపై అతని అభిమానానికి బీజేపీ నేతలు కూడా ఫిదా అవుతున్నారు. అతని ఫోటో సోషల్ మీడియాలో కూడా వైరలవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+