అమెరికా రండి: మోడీకి ఆహ్వానం పంపిన ఒబామా
న్యూఢిల్లీ: అమెరికాలో పర్యటించేందుకు ఆహ్వానిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక లేఖ పంపారు. శుక్రవారం అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి విలియం బర్న్స్ ఆహ్వానప్రతిని ఢిల్లీలో ప్రధాని మోడీకి అందజేశారు.
భారతదేశంతో గొప్ప భాగస్వామ్యాన్ని పంచుకోవాలని అమెరికా కోరుకుంటోందని ఈ సందర్భంగా ఆయన తలిపారు. ఫలప్రదమైన అమెరికా పర్యటన కోసం ఎదురుచూస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త శకం మొదలుకావాలని ఆయన ఆకాంక్షించారు.

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం నరేంద్ర మోడీకి ఒబామా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే మోడీని అమెరికా రావాలని ఆహ్వానించారు. సెప్టెంబర్ చివరి వారంలో మోడీ వాషింగ్టన్‌కు బయల్దేరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications