వ్యవసాయంలో మోదీ ప్రభుత్వం కొత్త ఒరవడి..!!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. తాను అనుసరిస్తోన్న వ్యవసాయ విధానాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. 2020లో మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టడం ద్వారా వివాదాలను ఎదుర్కొంది. ప్రత్యేకించి- పంజాబ్, హర్యానాల్లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.

కేంద్ర ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు జరిగాయి అప్పట్లో. వ్యవసాయ రంగాన్ని పణంగా పెట్టి కార్పొరేట్ ప్రయోజనాలకు కేంద్రం పూనుకుంటోందంటూ విమర్శించారు. రైతుల జీవితాలు, వారికి మరింత మెరుగైన జీవనోపాధిని కల్పించే లక్ష్యంతో ఏడు ప్రధాన పథకాలను ఇటీవలే ఆమోదించింది కేంద్రం.

Modi government has continued to prioritise the welfare of farmers

దీన్ని బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం అర్థరహితమని, రైతు వ్యతిరేకి అనే ముద్ర వేయడంలో అసంబద్ధమని విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు. రైతుల పట్ల కేంద్రం ఎంత శ్రద్ధ చూపుతోందో కొత్తగా ఆమోదించిన ఏడు పథకాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

వ్యవసాయ చట్టాల వివాదం అనేది ఓ తప్పుడు సమాచారం లేదా కేంద్రంపై అపవాదును మోపడానికేననేది సుస్పష్టమౌతోంది. వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేయడానికి రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలు- రైతుల సాధికారత సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలుగా మొదట్లో చిత్రీకరించారు.

రైతులు తమ ఉత్పత్తులను ఏపీఎంసీ మార్కెట్ల వెలుపల విక్రయించడానికి అనుమతించడం, కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ప్రారంభించడం, అవసరమైన వస్తువులపై స్టాక్ హోల్డింగ్ పరిమితులను తొలగించడం వంటివి అమలు చేయాలని ఈ చట్టాల ప్రధాన ఉద్దేశం.

వ్యవసాయ రంగంలో అమలు చేయదలిచిన ఈ సంస్కరణలు రైతులు, ఉత్పత్తులకు మరింత అధికంగా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడం, ధరల సౌలభ్యాన్ని అందించడానికి ఉద్దేశించినవే. అయినప్పటికీ- తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కనీస మద్దతు ధర వ్యవస్థను ప్రాథమికంగా చట్టాలు నిర్వీర్యం చేస్తాయనే భయం, కార్పొరేట్ సంస్థల దోపిడీకి రైతులు గురవుతారనే ఆందోళనలు నెలకొన్నాయి.

ఆ తరువాత సంభవించిన రైతుల నిరసనలు అత్యంత తీవ్రమైనవి. సుదీర్ఘ కాలం పాటు సాగినవి. వ్యవసాయ రంగం ఎదుర్కొంటోన్న ఆందోళనలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటూ చిత్రీకరించడానికి ప్రయత్నించడం.. మీడియా అత్యుత్సాహానికి దారి తీసిందనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.

బీజేపీని రైతు వ్యతిరేకిగా పేర్కొంటూ వారిలో నెలకొన్న అసంతృప్తికి మరింత ఆజ్యం పోశాయి విపక్ష పార్టీలు. అన్ని రకాలుగా పెరుగుతున్న ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నవంబర్ 2021లో ఆ చట్టాలను రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని చాలామంది పొలిటికల్ స్టంట్‌గా భావించారు.

ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు ఎంతమేర తమ తప్పుడు సమాచారంతో ప్రజల మనోగతాన్ని ఎంతవరకు ప్రభావితం చేసిందనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఒడిశా ముఖ్యమంత్రి-కిసాన్ యోజనను ప్రారంభించబోతోంది అక్కడి ప్రభుత్వం. రైతుల ఆదాయాన్ని పెంచడానికి 1,935 కోట్ల రూపాయల నిధులతో ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.

వ్యవసాయ చట్టాల వల్ల కేంద్రం అనుసరించి దలిచిన రైతు అనుకూల అజెండాకు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ.. మోదీ ప్రభుత్వం మాత్రం అన్నదాతల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూనే వస్తోంది. ఇటీవలే 13,966 కోట్ల రూపాయలతో ఏడు కీలక పథకాలకు ఆమోదం తెలిపింది.

ఈ చర్య- వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పట్టినట్టయింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్.. ఈ కార్యక్రమాల్లో అగ్రగామి. దీనికి 2,817 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.

ఈ మిషన్- వ్యవసాయ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుంది. కృత్రిమ మేధస్సు, బిగ్ డేటా, జియోస్పేషియల్ టెక్నాలజీలతో సహా అత్యాధునిక సాంకేతికతను అమలు చేయడానికి బాటలు వేసింది. వ్యవసాయ డేటాను సమగ్రంగా డిజిటల్ రిపోజిటరీ చేయడం, అగ్రి స్టాక్‌ను రూపొందించడం, రైతుల రిజిస్ట్రేషన్, విలేజ్ ల్యాండ్ మ్యాప్స్ రిజిస్ట్రేషన్ వంటివి ఏర్పాటు చేయడం వల్ల వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చినట్టవుతుంది.

రైతులను కొనుగోలుదారులతో నేరుగా అనుసంధానం చేయడం ద్వారా దళారుల పాత్రను నిర్మలించడానికి వీలు కలుగుతుంది ఈ విధానంలో. రైతులు తమ ఉత్పత్తులకు అవసరమైన గిట్టుబాటు ధరను పొందేలా చేయడం, పౌష్టికాహార భద్రత కోసం 3,979 కోట్ల రూపాయల బడ్జెట్‌తో కేంద్రం డిజిటల్ మిషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి సృష్టించడానికి బీజం వేస్తుందీ విధానం. జన్యుపరమైన వనరుల నిర్వహణపై దృష్టి పెట్టడానికి కారణమౌతుంది. వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా రైతాంగాన్ని సిద్ధం చేయగలుగుతుంది. ఈ పథకం దేశ వ్యవసాయ రంగం రూపురేఖలను సమూలంగా మార్చడంతో పాటు భవిష్యత్తులో ఆహార భద్రతను కల్పించగలుగుతుంది.

రైతుల కోసం సరికొత్త సహాయక చర్యలకు హర్యానా ముఖ్యమంత్రి ఇటీవలే శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వ్యవసాయం, పశుపోషణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం గుర్తించంది. అందుకే- దీన్ని బలోపేతం చేయడానికి 2,291 కోట్లు, పశుపోషణ, ఉత్పత్తి పథకానికి 1,702 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

ఈ కార్యక్రమాలు.. వచ్చే తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. వ్యవసాయ రంగంలో నిపుణులను తయారు చేయడానికి, పశువుల జాతుల జన్యుపరమైన పరిశోధనలను ప్రోత్సహించడం, దేశీయ వ్యవసాయ రంగంలో పోటీతత్వం పెరగడం, రైతుల ఆదాయం స్థిరంగా ఉండేలా చూసుకోవడాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ఉద్యానవనాల అభివృద్ధి, సహజ వనరుల నిర్వహణ కోసం 860 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్రం. సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ స్కీమ్‌లో రైతులకు ఆదాయ వనరులను మరింత పెంచడానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. పెద్ద ఎత్తున ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ ఉత్పాదకతను రెట్టింపు చేయడానికి దోహదపడింది.

సహజ వనరుల నిర్వహణ పథకం కింద 1,115 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. దీనిద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం వంటి చర్యలను తీసుకున్నట్టయింది.

ఆయా రైతాంగ అనుకూల చర్యలను తీసుకోవడం ద్వారా రైతు వ్యతిరేకి అనే దుష్ప్రచారాన్ని కేంద్రం తిప్పికొట్టినట్టింది. ఆయా పథకాలను కేంద్రం అమలు చేయడం- రైతుల జీవితాలు, జీవనోపాధిని మరింత మెరుగుపర్చడంలో బీజేపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

వ్యవసాయ చట్టాల వివాదం ప్రభుత్వ ప్రతిష్టను తాత్కాలికంగా దెబ్బతీసినప్పటికీ- ఈ కొత్త పథకాలు దీర్ఘకాలికంగా రైతులకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయి. బీజేపీ రైతాంగానికి అత్యంత అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయాలను మరింత బలపరిచే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+