మొన్న బీజేపీలో చేరిక,నేడు Y+భద్రత -‘స్టార్ క్యాంపెయినర్’ మిథున్ చక్రవర్తిపై మోదీ సర్కార్ ఔదార్యం
''నన్ను కోరల్లేని, హాని చేయని వానపాముగా అనుకోకండి.. నేను కోబ్రా(విష నాగు)ను.. ఒక్క కాటుతో ఎవరినైనా అంతం చేయగలను. నా దెబ్బ మామూలుగా ఉండదు.. ఇక్కడ కొడితే శవం స్మశానంలో తేలుతుంది'' అంటూ ప్రధాని మోదీ సాక్షిగా సంచలన ప్రసంగంతో మొన్ననే బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు నటుడు మిథున్ చక్రవర్తి. అలా పార్టీలో చేరారో లేదో.. ఇలా ఆయకు వై ప్లస్ భద్రత కల్పిస్తూ మోదీ సర్కార్ ఆదేశాలిచ్చింది..

మొన్న చేరిక.. నేడు భద్రత..
రెండు రోజుల కిదంటే బీజేపీలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి కేంద్ర హోం శాఖ బుధవారంనాడు 'వై-ప్లస్' భద్రత కల్పించింది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు (సీఐఎస్ఎఫ్) ఆయనకు ఈ భద్రత కల్పిస్తాయని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. సహజంగా వై-ప్లస్ భద్రత కింద వీఐపీలకు 11 మంది కమెండోలతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. 55 మందికి పైగా భద్రతా సిబ్బంది వీఐపీల నివాసం వద్ద మోహరిస్తారు. కాగా,

క్యాంపెయినర్‌గా డిస్కో కింగ్
దీదీ కోటలో పాగా వేయాలని పరితపిస్తున్న బీజేపీ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలో మిథున్ చక్రవర్తితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, బెంగాల్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ కైలాష్ విజయ్ వర్గీయ్, రాష్ట్ర పార్టీ చీఫ్ దిలీప్ ఘోష్ తదితరులు ఉన్నారు. బాలీవుడ్ డిస్కో కింగ్ గా మిథున్ కు పేరున్న సంగతి తెలిసిందే. కాగా,

సీఎంపై దాడి సమయంలోనే..
ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై దాడి జరిగిన కాసేపటికే, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి కేంద్ర సెక్యూరిటీ కల్పించారన్న వార్త వెలుగులోకి రావడం గమనార్హం. నందిగ్రామ్ నుంచి పోటీచేస్తోన్న సీఎం మమతా బెనర్జీ ఇవాళ నామినేషన్ వేసి, ప్రచారం ముగించుకుని బయలుదేరగా, కారు ఎక్కుతున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆమెను కుట్రపూరితంగా తోసేశారని, కాలికి గాయం అయిందని, దీనపై ఈసీకి ఫర్యాదు చేస్తానని మమత తెలిపారు. బెంగాల్ డీజీపీని ఈసీ మార్చేసిన తర్వాత తొలి మేజర్ ఘటన ఇది. కాగా, 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఈనెల 27 నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి.












Click it and Unblock the Notifications