దసరా బోనస్: 12లక్షల మంది రైల్వే ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం తీపి కబురు
న్యూఢిల్లీ: దసరా పర్వదినం సందర్భంగా రైల్వే ఉద్యోగులకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. దసరా పండగ సందర్భంగా ఈ ఏడాది కూడా 78రోజులకు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పీఎల్బీ) 78రోజులకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి రవిశంకర్ బుధవారం వెల్లడించారు. నాన్ గెజిట్ రైల్వే ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ లభించనుందని తెలిపారు.

ఈ బోనస్ కింద ఉద్యోగులు తమ వేతనంతోపాటు సుమారు రూ.18వేలు అదనంగా బోనస్ కింద పొందనున్నారు. పీఎల్బీ బోనస్‌తో సుమారు 12.26లక్షల మంది రైల్వే ఉద్యోగులు పొందనున్నారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(ఆర్పీఎస్ఎఫ్) ఉద్యోగులకు ఇది వర్తించదు. ఈ బోనస్ వల్ల దాదాపు రూ. 2044.31 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుంది. గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఈ బోనస్ ఇస్తోంది.
-
Viral Video: రైల్వే బోగీనా..? లేక బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా..? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications