సైనికులను అవమానిస్తున్నారు: ప్రధాని మోడీపై రాహుల్ ఫైర్, చైనా సైనికుల చొరబాటు.?

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన బీహర్ నావడ జిల్లా హిసువాలో ప్రచారం నిర్వహించారు. చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించలేదని మోడీ కామెంట్ చేయడంపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు సైనికులను అవమానించేలా ఉన్నాయని చెప్పారు.

డ్రాగన్ దయాదితో జరిగిన ఘర్షణలో యువ బీహరీ సైనికులు అమరులైతే.. ప్రధానమంత్రిగా అబద్దాలు చెప్పడం ఏంటీ అని నిలదీశారు. బీహర్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన సైనికులు చనిపోలేదా అని అడిగారు. రేయనక, పగలనక.. ఎండ, వానల్లో సైనికులు పనిచేస్తున్నారని గుర్తుచేశారు. అలా పనిచేస్తోన్న వారి ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా కామెంట్ చేయడం సరికాదన్నారు.

modi ‘insulted’ soldiers when he said nobody intruded into Ladakh: Rahul

తూర్పు లడాఖ్‌లో గల గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయిన అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. చైనా 1200 కిలోమీటర్ల భూ భాగం దాటి వచ్చిందని పేర్కొన్నారు. ఇంత జరిగితే ఏం జరగలేదు.. చొరబడలేదని ప్రధాని పేర్కొన్నడం మంచి పద్ధతి కాదన్నారు. అంటే భారత భూ భాగంలోకి రావాలని మీరు చైనా సైనికులను పిలిచారా అని అడిగారు.

బీహర్ యువతకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో సమాధానం చెప్పాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని అడిగారు. తాను రైతులు, సైనికులు, కార్మికులు, చిన్న వ్యాపారుల ముందు తలదించుకుంటానని.. వారి కోసం పనిచేస్తానని రాహుల్ గాంధీ తెలిపారు. కానీ ప్రధాని మోడీ మాత్రం అంబానీ, అదానీల కోసం పనిచేస్తున్నారని ఫైరయ్యారు.

Recommended Video

    Bihar Polls : Article 370 పునరుద్ధరన Bihar నుంచి అమరవీరులైన జవాన్లకు అవమానం! - PM Modi

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+