నోస్ట్రడోమస్ ఆనాడే చెప్పారు, అది ప్రధాని మోడీయే: బీజేపీ ఎంపీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తూర్పు ప్రాంతంలో ఒక వ్యక్తి ఉద్భవించి భారత దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేరుస్తారని ఫ్రాన్స్‌కు చెందిన జ్యోతిష్య శాస్త్రవేత్త నోస్ట్రడోమస్ ఆనాడే చెప్పారని, ఆ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీయేనని బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్యా అన్నారు.

భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకు వెళ్లే వ్యక్తి తూర్పు ప్రాంతంలో జన్మిస్తారంటూ నోస్ట్రడామస్ ఎప్పుడో జోస్యం చెప్పారన్నారు. జోస్యం చెప్పారు. ఆయన చెప్పిన వ్యక్తి నిస్సందేహంగా ప్రధాని మోడీయే అన్నారు.

ఈ విషయాన్ని కిరీట్ సోమయ్యా లోకసభలో చెప్పారు. సోమవారం సభలో గ్రాంటుల కోసం సప్లిమెంటరీ డిమాండ్లపై ఎంపీ కిరీట్ మాట్లాడారు.

నోస్ట్రడోమస్ చెప్పిందే జర్గుతుంది: పరిపూర్ణానందస్వామి

Modi is the leader Nostradamus had predicted: BJP MP Kirit Somaiya

16వ శతాబ్దానికి చెందిన నోస్ట్రడామస్ భవిష్యవాణి చెప్పడంలో దిట్టగా పేరు సంపాదించుకున్నారు. అనేక చారిత్రక ఘట్టాలను ఆయన ముందుగానే చెప్పారు. హిట్లర్ గురించి, 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పకూలడం గురించి ఆయన ముందే జోస్యం చెప్పారని అంటారు.

కాగా, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా ఈ సందర్భంగా కిరిత్ సోమయ్య ప్రస్తావించారు. ప్రతి చర్చలోనూ విపక్షాలు ఈ ప్రశ్న లేవనెత్తడం అలవాటై పోయిందన్నారు. బడ్జెట్‌పై చర్చ జరుగుతున్నప్పుడు కూడా నోట్ల రద్దు గురించి మాట్లాడారని, ఈ రోజు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi is the man from French soothsayer Nostradamus’ prophecy who will take India to new heights, the BJP’s Lok Sabha member Kirit Somaiya said on Monday .
Please Wait while comments are loading...