వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరాతకం: రేప్ విక్టిమ్ ఒంటిపై 38 గాయాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలో అత్యంత పాశవికంగా అత్యాచారానికి, ఆపై హత్యకు గురైన దళిత యువతి కుటుంబాన్ని ప్రధాని మోడీ పరామర్శించనున్నారు. ఈ నెల 11న మోడీ ఆ యువతి స్వగ్రామమైన పెరువంబూర్‌కు స్వయంగా వెళ్లి బాధితురాలి తల్లిని ఓదార్చనున్నారు.

ప్రధాని మోడీతో పాటు సామాజిక న్యాయశాఖ మంత్రి థవర్ చాంద్ గెహ్లాట్ కూడా వారి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. ఇప్పటికే ఈ కేసు పురోగతిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖకు పంపాలని కేరళ డీజీపీని ఆదేశించారు.

మరోవైపు దారుణమైన లైంగిక దాడి, అనంతరం హత్యకు గురైన 30 ఏళ్ల దళిత లా విద్యార్ధిని ఒంటిపై భాగంలో పాటు లోపల భాగాల్లో మొత్తం 38 చిన్న పెద్ద గాయాలయ్యాయి. పెరువంబూర్‌లో ఏప్రిల్ 28న ఢిల్లీలో నిర్భయ ఘటనకన్నా దారుణంగా ఒంటరి తల్లితో కలిసి ఒకే గదిలో నివశిస్తోన్న దళిత యువతిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హతమార్చారు.

<strong>'కేరళ నిర్భయ': దళిత లా విద్యార్ధినిపై రేప్, అసలేం జరిగింది?</strong>'కేరళ నిర్భయ': దళిత లా విద్యార్ధినిపై రేప్, అసలేం జరిగింది?

Modi to Meet Family of Kerala Rape Victim on May 11

బాధితురాలికి పోస్టు మార్టం నిర్వహించిన అలెప్పా మెడికల్ కాలేజీ వైద్యులు అత్యాచారానికి పాల్పడిన వారు చాలా దారుణంగా వ్యవహారించారని తెలిపారు. పోస్టు మార్టం నివేదిక ప్రకారం బాధితురాలి ఒంటిపైన, శరీరం లోపలి భాగాల్లో మొత్తం కలిపి 38 చోట్ల చిన్న పెద్ద గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

మే 16న కేరళలో జరగనున్న ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, నిందితులను శిక్షిస్తామని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఇప్పటికే ప్రకటించారు. ఈ కేసు విచారణ సరైన మార్గంలోనే కొనసాగుతోందన్నారు.

బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఎన్నికల కమిషన్ అవకాశం ఇస్తే ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకునేందుకైనా తాను సిద్ధమని, ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. స్వయంగా ప్రధాని మోడీనే దృష్టి సారించడంతో ఈ కేసుకు ప్రాధాన్యత సంతరించుకుంది.

'కేరళ నిర్భయ' అసలేం జరిగింది?:

నిరుపేద దళిత మహిళ... ఒంటరి తల్లితో కలిసి ఒకే ఒక గదిలో నివశిస్తోంది. న్యాయ విద్య చదువుకుంటోంది. తల్లి బయటకు పనిపై వెళ్లడంతో ఇంట్లోనే ఉంది. ఈ క్రమంలో సొంత ఇంట్లోనే ఆమెపై అత్యాచారం చేశారు. పదునైన ఆయుధాలతో ఆమె శరీరంపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. దీంతో ఆమె కడుపులోని అవయవాలన్నీ బయటకు వచ్చేశాయి.

శరీరంపై ఏకంగా 30 చోట్ల తీవ్ర గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఏప్రిల్ 28న ఎర్నాకుళం జిల్లా పెరంబవూర్‌లో లా కాలేజీ విద్యార్థినిపై ఆమె ఇంట్లోనే అత్యాచారం చేసి, పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. అత్యాచారం జరిగిన సమయంలో నిందితులతో ఆమె పెనుగులాడినట్లు ఆధారాలున్నాయని పోలీసులు తెలిపారు.

English summary
Prime Minister Narendra Modi is likely to visit the mother of the Dalit woman, who was raped and murdered in Perumbavoor, on May 11.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X