ఒబామా తర్వాత మోడీ ఫేస్‌'బుక్', పీఎంవో ట్విట్టర్ రగడ

న్యూఢిల్లీ: కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫేస్‌బుక్ పేజీకి ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. పెద్ద ఎత్తున మోడీకి ఫేస్‌'బుక్' అవుతున్నరు. ప్రజలు ఎన్నుకున్న నేతల్లో ఇలా అత్యంత త్వరితగతిన ఆదరణ పొందుతున్న నేతల్లో ఆయనదే ప్రథమ స్థానమని ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌కు చెందిన అధికారులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌లో ఎక్కువమంది అభిమానులున్న రాజకీయ నాయకుల్లో మోడీది రెండో స్థానమని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక్కరే ఆన కంటే ముందు ఉన్నారు. భారత్‌లో లోకసభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ రోజైన ఏప్రిల్ 7న మోడీకి కోటి 24 లక్షల మందికి పైగా అభిమానులు ఉండగా.. మంగళవారం నాటికి కోటిన్నర దాటింది.

Modi's Facebook page said to be fastest growing for any elected leader

పీఎంవో ట్విట్టర్ వివాదం

ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ట్విట్టర్ ఖాతా పైన వివాదం రాజుకుంది ఇప్పటి వరకు పిఎంవోఇండియా అనే పేరుతో ఉన్న ఖాతాను ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు మంగళవారం పిఎంవోఇండియాఆర్కైవ్‌గా మార్చారు. దీనిపై బిజెపి మండిపడింది.

ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ నిర్వహించిన ట్విట్టర్ ఖాతా ఆయన వ్యక్తిగతమైనదని కాదని, దానిని కొత్త ప్రధానికి అందచేయాలన్నారు. యూపిఏ సర్కారు తీరు ఆఖరు క్షణాల్లో కూడా మారలేదని, ఈ పని నైతికంగా, చట్టపరంగా సరైంది కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+