వేలానికి మోడీ సూట్, నా కొడుక్కి అంత సీన్ లేదని ఎన్నారై బిజినెస్‌మెన్

సూరత్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన సూట్ పైన విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సూట్ పైన ఆయన అట్టహాసంగా నరేంద్ర మోడీ అని తన పేరును నిలువుగీతల్లా రాయించుకున్నారు. దాని ధర పదిలక్షల రూపాయలు కావడంతో పలు పార్టీలు విమర్శలు గుప్పించాయి.

ఇప్పుడు ఆ సూట్‌ను వేలం వేయనున్నారు. బుధవారం సూరత్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొమ్మిది నెలల అధికార కాలంలో ఆయనకొచ్చిన 455 బహుమతులు, వస్తువులనూ దీంట్లో వేలం వేస్తారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి నిధుల సమీకరణ కోసం వాటన్నిటినీ అమ్ముతున్నారు.

ఈ వేలం మూడు రోజులపాటు జరుగుతుంది. ఆయన వస్తువులన్నీ జాతీయ సంపదగా గుర్తించే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నగర మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు. కాగా, గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పటి నుంచే మోడీ తన వస్తువుల వేలానికి తెర తీశారు.

Modi's 'Rs 10 lakh' suit: My son does not have guts to spend that kind of money, says NRI businessman

నా కొడుక్కు అంత లేదు!: ఎన్నారై బిజినెస్‌మెన్

మోడీకి ఈ సూట్ ఇచ్చారని ప్రచారం జరగడంతో దీనిపై రమేష్ కుమార్ భికబాయి విరానీ అనే ఎన్నారై బిజినెస్‌మెన్ స్పందించారు. రమేష్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను గుజరాత్‌కు చెందిన వాడినని, ఇటివల వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా తాను ప్రధాని మోడీకి దానిని ఇచ్చానని చెప్పారు. అలాగే తన తనయుడు పెళ్లికి ఆహ్వానించానని చెప్పారు.

ఈ సూట్‌ను తన కొడుకు తరఫున తాను ఎల్డర్ బ్రదర్‌గా భావించే ప్రధాని మోడీకి ఇచ్చానని చెప్పారు. అయితే, అందరు చెప్పుకుంటున్నట్లుగా దాని ధర అంత ఉండదని చెప్పారు. తన కొడుకు అంత ఖర్చు చేసి దానిని చేసి ఉండరని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+