నరేంద్ర మోడీ క్షేమం కోసం యశోదాబెన్ ప్రత్యేక పూజలు

శ్రావణ మాసం సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ఈ గుడికి వచ్చి పూజలు చేస్తారు. గుజరాతీ క్యాలెండర్ ప్రకారం తాను ప్రతీనెలా పంచమి రోజున ఈ ఆలయాన్ని సందర్శించుకుంటానని ఆమె తెలిపారు.
ఈ విధంగా 51 పర్యాయాలు వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించుకుంటానని మొక్కుకున్నట్లు యశోదాబెన్ చెప్పారు. యశోదా బెన్ అమితమైన భక్తురాలని, ఆమె తరచూ వివిధ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళుతుంటారనీ.. అందుకు ప్రయాణ వసతిని కల్పించాలని ఆమె వెంట వచ్చిన ఆమె సోదరుడు అశోక్ మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇది ఇలా ఉండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం(ఆగస్టు 3న) పొరుగు దేశమైన నేపాల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో విద్యుత్ తదితర ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశముంది. నేపాల్‌కు అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. భారత ప్రధాని ఒకరు నేపాల్ వెళ్లడం 17ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications