వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్ల చేష్టలతో ఎన్నికలు గెలవలేరు.. దోచుకున్న ప్రతి పైసాకు మమత లెక్క చెప్పాలన్న మోడీ

|
Google Oneindia TeluguNews

కూచ్ బెహార్ : పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతల ప్రచారం ఊపందుకుంటోంది. ప్రతిపక్షాలపై విమర్శల పదును పెరుగుతోంది. బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కూచ్ బెహార్‌లో ప్రచారం నిర్వహించిన ప్రధాని తృణమూల్ అధినేత్రి మమతపై నిప్పులు చెరిగారు. మమత హయాంలో అవినీతి పెరిగిపోయిందన్న ఆయన.. వివిధ స్కాంల ద్వారా మమత ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. దోచుకున్న ప్రతి పైసాకు సంబంధించి చౌకీదార్‌కు లెక్క చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు.

<strong>సీఎం సన్నిహితులపై ఐటీ కొరడా.. 50 చోట్ల సోదాలు.. 9 కోట్లు స్వాధీనం..!</strong>సీఎం సన్నిహితులపై ఐటీ కొరడా.. 50 చోట్ల సోదాలు.. 9 కోట్లు స్వాధీనం..!

మమత హయాం స్కాంలమయం

మమత హయాం స్కాంలమయం

బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతి పెచ్చుమీరిందని మోడీ విమర్శించారు. శారద, నారద, రోజ్ వ్యాలీలాంటి స్కాంలతో ప్రజల్ని దోచుకోవడమే పనిగా మారిందని ఆరోపించారు. ఇలా దోచుకున్న ప్రతిపైసాకు సంబంధిచి ఈ చాకీదార్‌ లెక్క తీసుకుంటాడని ప్రజలకు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అడ్డుపడుతున్న మమత... వాటి ద్వారా బెంగాల్ ప్రజలు లబ్ది పొందకుండా చేస్తున్నారని విమర్శించారు.

పిల్ల చేష్టలతో గెలవలేరు

పిల్ల చేష్టలతో గెలవలేరు

కూచ్ బెహార్‌లో బహిరంగ సభ ఏర్పాటుకు చిన్న స్థలాన్ని ఇవ్వడంపై మోడీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు సభకు హాజరుకాకుండా మమత అన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని విమర్శించారు. ఇలాంటి పిల్ల చేష్టలతో మమత ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారని మోడీసాధిస్తారని ప్రశ్నించారు.

అక్రమ వలసదారులకు ఆశ్రయం

అక్రమ వలసదారులకు ఆశ్రయం

ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు మమత ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటారని మోడీ విమర్శించారు. ఇందులో భాగంగానే
దీదీ అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పిస్తున్నారని అన్నారు. నేషనల్‌ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్, సిటిజన్ అమెండ్‌మెంట్ బిల్ ద్వారా అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను దీదీ మహాకూటమి నేతలతో కలిసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నాన్ని ప్రజలు ఎన్నటికీ సహించరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.

English summary
Prime Minister Narendra Modi today launched a frontal attack on West Bengal Chief Minister Mamata Banerjee, who he said had applied "brakes" on several central schemes meant for the state.Addressing a rally at Cooch Behar in north Bengal today, PM Modi said the Trinamool Congress chief has denied the people of the state benefits of central schemes available in other states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X