ఫేస్‌బుక్ షెరిల్ శాండ్‌బర్గ్ సాయం కోరిన మోడీ(పిక్చర్స్)

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ గురువారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం మోడీ ఆమెతో సమావేశం అత్యంత ఫలప్రదంగా సాగినట్లు ఫేస్‌బుక్ పేజీలో రాశారు.

సుపరిపాలనకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు అత్యంత కీలకమని నరేంద్ర మోడీ భేటీ సందర్భంగా ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్‌తో అన్నారు. అంతేకాకుండా భారత్‌లో పరిశుభ్రత పైన అవగాహన కల్పించేందుకు ఫేస్‌బుక్ దోహదం చేయాలని ఆమెను ప్రధాని కోరారు.

కనెక్టివిటీకి సంబంధించి షెరిల్ తన ఆలోచనలను ఈ సమావేశంలో మోడీతో పంచుకున్నారు. ఫేస్‌బుక్ సీవోవో అయిన తర్వాత తొలిసారి ఆమె అయిదో రోజుల పాటు భారత్ పర్యటన నిమిత్తం వచ్చారు.

మోడీతో షెరిల్

మోడీతో షెరిల్

సమర్థ పరిపాలనకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలతో నేరుగా సంబంధాలు నెలకొల్పుకోవాల్సిన ప్రాధాన్యతను, ఆవశ్యకతను నరేంద్ర మోడీ నొక్కి చెప్పారని షెరిల్ అన్నారు.

 మోడీతో షెరిల్

మోడీతో షెరిల్

తాను ఫేస్‌బుక్‌ను ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నదీ భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకు వివరించారని సమావేశం అనంతరం షెరిల్ చెప్పారు.

 మోడీతో షెరిల్

మోడీతో షెరిల్

భారత్‌కు మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు ఫేస్‌బుక్‌ను వినియోగించుకోవచ్చుననే అంశాన్ని కూడా నరేంద్ర మోడీ చర్చించినట్లు ఆమె చెప్పారు.

 మోడీతో షెరిల్

మోడీతో షెరిల్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ గురువారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం మోడీ ఆమెతో సమావేశం అత్యంత ఫలప్రదంగా సాగినట్లు ఫేస్‌బుక్ పేజీలో రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+