Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్ పై తీవ్ర ఒత్తిడి.. చీనాబ్ నదిపై మోదీ వ్యూహాత్మక అస్త్రం!

కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతదేశ ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు శరవేగంగా కృషి చేస్తోంది. శత్రు దేశాలతో వస్తున్న విపత్తులను దీటుగా ఎదుర్కొంటూనే దేశ ప్రగతి కోసం కృషి చేస్తోంది. అందులో భాగంగానే కేంద్రం చీనాబ్ నది పైన ప్రస్తుతం చేపట్టిన క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు పైన దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.పాక్ వెన్నులో వణుకు పుట్టించేలా చీనాబ్ నదిపై మోదీ వ్యూహాత్మక ఆయుధం క్వార్ ప్రాజెక్ట్.

చీనాబ్ నదిపై క్వార్ జల విద్యుత్ ప్రాజెక్ట్
కేంద్రంలోని మోడీ సర్కార్ చీనాబ్ నది పైన నిర్మిస్తున్న క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత, పాకిస్తాన్ శిక్షణ పొందిన ఉగ్రవాదుల ప్రమేయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది.

Modi strategic weapon on the Chenab River is set to send shivers down Pakistan spine

ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచిన కేంద్రం
దీని తర్వాత వేసిన కీలక అడుగులో చీనాబ్ నది పైన ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచింది. ఈ క్రమంలోనే క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని కీలకంగా తీసుకున్న కేంద్రం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో బాగా వేగం పెంచింది. జాతీయ భద్రతతో పాటు జలవనరుల స్వయం సమృద్ధి లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నుండి నీతి కాలంలోనే పూర్తిచేయాలని కేంద్రం భావిస్తోంది.

540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో జలవిద్యుత్ ప్రాజెక్ట్
క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో, చీనాబ్ నదిపై నిర్మాణంలో ఉంది. ఇది రన్ ఆఫ్ ది రివర్ విధానంలో చేపట్టిన జల విద్యుత్ ప్రాజెక్టు కాగా, సుమారు 540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మాణం చేస్తోంది కేంద్రం. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్హెచ్పీసీ నిర్మాణం చేస్తోంది.

ఉత్తరభారత దేశ విద్యుత్ అవసరాలు తీర్చే ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర భారత దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంలో ఇది కీలక భూమిక పోషిస్తుంది. పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీ ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా నిర్మించబడుతున్న ఈ ప్రాజెక్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని పెంచడంతోపాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది.

పహల్గాం దాడి తర్వాత వ్యూహాత్మక ప్రాజెక్ట్ గా క్వార్
మొత్తంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మారిన భద్రతా పరిస్థితుల నేపథ్యంలో క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు కేవలం అభివృద్ధి ప్రాజెక్టుగా మాత్రమే కాక, దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు కీలక ప్రాజెక్టుగా మారింది.

More From
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+