Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒడిశాలో ప్రధాని మోడీ.. ఫొని ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..

భువనేశ్వర్ : ఫొని తుఫాను కారణంగా అతలాకుతలమైన ఒడిశాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగుతోంది. తొలుత సీఎంతో సమావేశమైన ప్రధాని అనంతరం ఏరియల్ సర్వే ద్వారా తాజా పరిస్థితిని తెలుసుకోనున్నారు. ఆ తర్వాత తాజా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారిన ఒడిశాకు మోడీ భారీ మొత్తంలో ఆర్థికసాయం ప్రకటించే అవకాశముంది.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ గనేషీ లాల్, సీఎం నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాని స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో భేటీయై వరద పరిస్థితిపై చర్చించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలైన పూరీ, కుర్దా, కటక్, జగత్‌సింగ్‌పూర్, జాజ్‌పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో పరిస్థితిని మోడీ ఏరియల్ సర్వే ద్వారా తెలుసుకోనున్నారు. తిరుగు ప్రయాణంలో ఎయిర్‌పోర్టులోనే ఆయన ఒడిశా ప్రభుత్వ అధికారులతో రివ్యూ నిర్వహించి సహాయక, పునరావాస కార్యక్రమాలపై చర్చించనున్నారు.

modi to take aerial survey in cyclone hit odisha
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+