భారత్-ఫ్రాన్స్ మధ్య 17 ఒప్పందాలు: 36 రాఫెల్స్ జెట్స్ కొనుగోలు
ప్యారిస్: భారత్‌లో రక్షణ, శాస్త్ర సాంకేతిక, మౌలిక వసతుల రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. వివిధ రంగాల్లో దాదాపు రూ.13,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం కుదిరింది. భారత వైమానిక దళం అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 రఫాలే యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు.

మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు ఫ్రాన్స్ ముందుకొచ్చింది. ఎలిసీ ప్యాలెస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండ్‌లో శిఖరాగ్ర చర్చల అనంతరం ఆయనతో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోడీ ఈ ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలను సమీక్షించిన ఇద్దరు నేతలు, ఆర్థిక, వాణిజ్య, శాస్త్రసాంకేతిక, సాంస్కృతిక, అణువిద్యుత్, విద్య తదితర రంగాల్లో సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు.
ద్వైపాక్షికం, అంతర్జాతీయంగా భారత్‌కు ప్రాన్స్ నమ్మకమైన భాగస్వామి అని ప్రధాని మోడీ అన్నారు. రెండుదేశాల బంధం సుదీర్ఘమైనదేకాకుండా ఎంతో శక్తిమంతమైందని తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఎలిసీ ప్యాలెస్‌లో ఆ దేశాధ్యక్షుడు హొలాండేతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన మోడీ, తనకు ఘనస్వాగతం పలికిన ఫ్రాన్స్ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యదేశాలపై భారత్, ఫ్రాన్స్ ఒకేరకమైన విలువలు, సిద్ధాంతాలను అనుసరిస్తున్నాయన్నారు.

హొలాండేతో పలు అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపానని చెప్పారు. ఒక పథకంగానే కాకుండా గొప్ప ఆశయంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో రక్షణ రంగంలో సహకారానికి హొలాండే హామీ ఇచ్చారని తెలిపారు. ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న 36 రాఫెల్ యుద్ధవిమానాలు కొనుగోలు చేస్తామని హొలాండేకు తెలిపానని, వీలైనంత త్వరగా వాటిని అందించాలని కోరినట్లు వివరించారు.

భారత్‌లో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన ఫ్రెంచ్ విద్యార్థులు ఆ తర్వాత కూడా పని అనుభవంకోసం భారత్‌లోనే ఉండేందుకు అనుమతిస్తామని తెలిపారు. భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ కంపెనీలను మోడీ ఆహ్వానించారు.

భారత్ అభివృద్ధికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే హామీ ఇచ్చారు. రెండు దేశాల మధ్య అనుబంధం కేవలం ఆర్థికాంశాలకు మాత్రమే పరిమితంకాదని, భారత్, ఫ్రాన్స్‌కు అంతర్జాతీయ బాధ్యతలున్నాయని తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దతిస్తుందని ప్రకటించారు. శాంతియుత వాతావరణం, స్థిరత్వం కోసం భారత్, ఫ్రాన్స్ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications