వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ.. చస్తారంటూ కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు: కేసు నమోదు (వీడియో)

|
Google Oneindia TeluguNews

నాగ్‌పూర్: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత షేక్ హుస్సేన్ ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాగ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు షేక్ హుస్సేన్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గిట్టిఖదన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.హుస్సేన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, 48 గంటల్లో అరెస్టు చేయాలని, లేని పక్షంలో తీవ్ర ఆందోళనకు దిగుతామని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.

నివేదికల ప్రకారం.. జూన్ 13 న జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ నగర అధ్యక్షుడు షేక్ హుస్సేన్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీపై కించపరిచే పదజాలం ఉపయోగించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించినందుకు నిరసనగా నాగ్‌పూర్‌లోని ఈడీ కార్యాలయం వెలుపల ప్రదర్శన చేస్తూ.. "జైసే కుట్టే కి మౌత్ హోతీ హై వైసే నరేంద్ర మోడీ కి మౌత్ హోగీ (మోడీ కుక్క చావు చస్తారు)" అని అన్నారు.

‘Modi will die a dog’s death’: Says Congress leader Sheikh Hussain, case registered

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ విచారణకు సంబంధించి కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీని ప్రశ్నించినందుకు పీఎం మోడీ, ఈడీని విమర్శించారు. దూకుడు నిరసనకు ప్రతిస్పందనగా నాగ్‌పూర్ పోలీసులు రాష్ట్ర మంత్రులు నితిన్ రౌత్, విజయ్ వడ్డెటివార్‌తో పాటు ఇతర కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు కాంగ్రెస్‌ నాయకుడు హుస్సేన్‌కు లేదని, ప్రధానిపై పరుష పదజాలంతో హుస్సేన్ నీచ స్థాయికి దిగజారారని జూన్ 15న ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు పేర్కొన్నారు.

'మహావికాస్ ఆఘాడి ఫిర్యాదు నమోదు చేయవద్దని పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. మరో రెండు రోజుల్లో పోలీసులు హుస్సేన్‌పై చర్యలు తీసుకోకుంటే కోర్టు తలుపులు తట్టి ఆందోళన చేస్తాం' అని బీజేపీ నేత చంద్రశేఖర్ బవాన్‌కులే హెచ్చరించారు.

English summary
‘Modi will die a dog’s death’: Says Congress leader Sheikh Hussain while protesting against ED in Nagpur, case registered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X