మోడీగారు! బీహార్లో దారుణంగా ఓడిపోతారు: కేజ్రీవాల్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం నాడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండో దఫా జరుగుతున్నాయి. ఈ సమయంలో కేజ్రీవాల్ బిజెపి ఓడిపోతుందని జోస్యం చెప్పారు.
నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి బీహార్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవటం ఖాయమని, నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియూ అధికారంలోకి వస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. మోడీ నేతృత్వంలోని బిజెపి దారుణంగా ఓటమి చవి చూస్తుందని చెప్పడం గమనార్హం.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి అధికారంలోకి వస్తారని చెప్పారు. కేజ్రీవాల్... నితీష్ కుమార్‌కు మద్దతు పలికిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తనకు వచ్చిన సమాచారం మేరకు.. 'మోడీజీ బీహార్‌లో దారుణంగా ఓటమి చవి చూస్తారు. నితీష్‌జీ గెలుస్తారు' అని ట్వీట్ చేశారు.

కాగా, శుక్రవారం ఆరు నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని 32 నియోజకవర్గాల్లో 456 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించనున్నారు. పోలింగ్ జరగనున్న జిల్లాల్లో కైముర్, రోహ్తాస్, అర్వాల్, జెహనాబాద్, ఔరంగాబాద్, గయ జిల్లాలున్నాయి.
49 నియోజకవర్గాల్లో మొదటి దళ పోలింగ్ పూర్తయిన తర్వాత ఒక మంత్రి నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటున్నట్లుగా ఉన్న స్టింగ్ వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎన్డీఏ నేతలు మహాకూటమిపై తన విమర్శలకు మరింత పదును పెట్టింది.
ఈ నెల 12న జెహనాబాద్, భుభువాలలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ వీడియోను కేంద్రంగా చేసుకుని జెడి(యు)-ఆర్‌జెడి-కాంగ్రెస్ పార్టీల మహాకూటమిపై విమర్శలు గుప్పించారు. రెండో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాలన్నీ కూడా నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనివే కావడం భద్రతా దళాలను భారీగా మోహరించారు.












Click it and Unblock the Notifications