Amit Shah: అతిక్ అహ్మద్ సోదరుల దారుణ హత్య తరువాత హోం శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్, సమాజ్‌వాది పార్టీ లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రాఫ్ అహ్మద్ దారుణ హత్య అనంతరం కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులకు భద్రత కల్పించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. జర్నలిస్టులమని చెప్పుకొన్న ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి వారిద్దరిపై కాల్పులు జరిపడమే దీనికి ప్రధాన కారణం. ఈ కాల్పుల్లో అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్ అక్కడికక్కడే మరణించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇటీవలే అతిక్ అహ్మద్ కుమారుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియలు ముగిసిన వేళ- అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్‌పై కాల్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనతో ప్రయాగ్ రాజ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిద్దరినీ మెడికల్ చెకప్ కోసం ఆసుపత్రికి తరలిస్తోన్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు నిర్ధారించారు.

అతిక్-అష్రాఫ్ అహ్మద్‌లను కాల్చిచంపిన లవ్‌లేష్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్య.. తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రెస్ కార్డులను మెడలో ధరించి.. వారు సంఘటన స్థలానికి చేరకున్నారు. వారు వినియోగించిన బైక్‌పై కూడా ప్రెస్ అని రాసి ఉన్నట్లు చెబుతున్నారు. ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టులుగా చెప్పుకొని- ఈ ఘాతుకానికి పాల్పడటాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.
దేశవ్యాప్తంగా జర్నలిస్టుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను రూపొందించనుంది. ఈ దిశగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు హోం మంత్రిత్వ శాఖ ఈ ఎస్ఓపీలపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను అమిత్ షా కార్యాలయానికి పంపించనుంది.

ఈ మార్గదర్శకాలతో కూడిన ప్రతిపాదనలపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తుది ఆమోదం లభించిన వెంటనే అవి అమలులోకి వస్తాయని హోం మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కూడా తగిన భద్రతను కల్పించే దిశగా ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్స్ ఉంటాయని తెలుస్తోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications