Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వయనాడ్ బాధితులకు మోహన్ లాల్ రూ. 3 కోట్ల విరాళం: లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో

కేరళలోని వయనాడ్‌ బాధితులకు సాయం చేసేందుకు మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ స్వయంగా ముందుకొచ్చారు. శనివారం ఆయన టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌.. విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశమయ్యారు. సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు.

బాధితులకు పునరావాసం కల్పించడం కోసం రూ.3 కోట్ల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు మోహన్ లాల్. ప్రస్తుతం మోహన్​ లాల్​ ఆర్మీ దుస్తుల్లో ఉన్న వయనాడ్​ పర్యటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Mohan lal donates Rs 3 crore to Wayanad victims

కాగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వయనాడ్ బాధితుల కోసం రూ.1 లక్ష విరాళం ప్రకటించారు. ఆయన భార్య టీకే కమల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.33,000 అందించారు. ఇక, కేరళ సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు కూడా తమ నెల జీతం రూ.50,000లను ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నామని తెలిపారు.

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 300 మందికిపైగా మృతి
చెందడం యావత్‌ దేశాన్ని కలచివేస్తోంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకువస్తున్నారు. ఇప్పటికే పలువురు నటులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు భారీ విరాళాలు ఇచ్చారు. మరోవైపు,ఆచూకీ గల్లంతైనవారిని గుర్తించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు డ్రోన్లు, రాడార్లు, మొబైల్‌ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ముమ్మర ప్రయత్నం కొనసాగుతోంది.

గిరిజన కుటుంబాన్ని కాపాడిన రెస్క్యూ టీం

కల్పేట ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కె.హాషిస్‌ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంకా అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నా సహాయక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఈ సమయంలో అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకొని ఉండడాన్ని బృందం గమనించింది. వారిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నాలుగున్నర గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబం గుహలో చిక్కుకొని ఉండగా వారిని రక్షించారు.

అయితే, కొద్దిరోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించి పోయి ఉన్నారని రెస్య్కూ అధికారి తెలిపారు. దీంతో తమ వద్ద ఉన్న ఆహారాన్ని వారికి తినిపించామన్నారు. తమతో రావాల్సిందిగా వారిని కోరగా ఆ కుటుంబం నిరాకరించిందని, సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఎంతో బతిమాలగా వారి తండ్రి ఒప్పుకున్నారని తెలిపారు. పిల్లలు ఇద్దరినీ తమ శరీరాలకు కట్టుకొని తాళ్ల సహాయంతో గిరిజన కుటుంబాన్ని కొండపై నుంచి సురక్షితంగా కిందకు తీసుకువచ్చామని సదరు అధికారి తెలిపారు.

అనంతరం ఆ కుటుంబాన్ని అత్తమాల యాంటీ-పోచింగ్ కార్యాలయానికి తరలించినట్లుగా చెప్పారు. ప్రస్తుతం వారు అక్కడ సురక్షితంగా ఉన్నారన్నారు. వర్షాలు తీవ్రరూపం దాల్చడంతో అటవీశాఖ వాయనాడ్‌లోని అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన తెగలకు చెందిన చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+