తన చేతిలోని రిమోట్ లాక్కున్నాడని.. ఉరివేసుకుని తల్లి ఆత్మహత్య
ముంబై: టీవీ రిమోట్ కోసం జరిగిన చిన్న ఘటన ఓ మహిళ ప్రాణం తీసింది. తన కొడుకు తన చేతిలోని టీవీ రిమోట్‌ను తీసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నేవీ ముంబైలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మృతురాలు షబానా పెర్జాడే(38) టీవీలో వస్తున్న తనకు ఇష్టమైన ఛానల్ ప్రొగ్రాం చూస్తోంది. అదే సమయంలో తనకిష్టమైన క్రికెట్ చూడాలని ఆమె కుమారుడు షారుక్ ఆమె చేతిలోని రిమోట్ లాక్కున్నాడు.

ఆ తర్వాత అతడు తనకు కావాల్సిన క్రికెట్ ఛానల్ పెట్టుకున్నాడు. దీంతో ఆగ్రహానికి, మనస్తాపానికి గురైన షబానా తన గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఎంతకూ తన గది నుంచి తల్లి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన షారుక్.. గదిలోకి వెళ్లిచూశాడు.
ఆమె అప్పటికే ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications