మద్యం, నగదు పంపిణీ: హెచ్ఆర్సీకి ఫిర్యాదు
హుజురాబాద్ బై పోల్ ప్రచారం ముగిసింది. ఇక ప్రలోభాలే మిగిలింది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఉప ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. డబ్బులు, మద్యం పంపిణీపై హైకోర్టు న్యాయవాది సయ్యద్ సలీమ్ హెచ్ఆర్సీ లో ఫిర్యాదు చేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం బుధవారం ముగియడంతో ఓటర్లకు రాజకీయ పార్టీలు డబ్బులు ఆశ చూపి మభ్యపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఓటుకు ఆరు వేలు ఇస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయని వివరించారు. అయినా అధికారులు, పోలీస్ యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తుందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలు, ఇలా ఓటుకు నోటు చందంగా జరగడం చాలా ప్రమాదకరమన్నారు. ఇప్పటికైనా ఎన్నికలు పూర్తైయ్యే వరకు పోలీసులు, ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా విధులు నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని హెచ్చార్సీని న్యాయవాది సయ్యద్ కోరారు.

ఇటు హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.
Recommended Video
హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications