జైల్లో ఏసీ, టీవీ, బెడ్, లిక్కర్, వాషింగ్ మెషిన్, స్మార్ట్ ఫోన్, ఖైదీ లగ్జరీ లైఫ్, ఫోటోలు వైరల్!
చెన్నై: డబ్బు ఉంటే జైలులో అయినా నేనే రాజు నేనే మంత్రి అంటూ కాలం గడిపేయవచ్చు అని తాజాగా మరోసారి వెలుగు చూసింది. జైలు శిక్షకు గురైన ఖైదీ జైల్లో లగ్జరీ జీవితం అనుభవిస్తున్నాడు. జైల్లో ఏసీ, టీవీ, లిక్కర్, స్మార్ట్ ఫోన్ తదితర సదుపాయాలతో ఖైదీ విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఫోటోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చెన్నైలోని పుళ్ హల్ సెంట్రల్ జైల్లో తాను ఎలాంటి విలాసవంతమైన జీవితం గడుపుతున్నానో మీరు చూడండి అంటూ నిందితుడు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు షాక్ కు గురై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

నకిలీ పాస్ పోర్టు
నకిలీ పాస్ పార్ట్ తీసుకున్నాడని వెలుగు చూడటంతో పోలీసులు రషీదుద్దిన్ అనే నిందితుడిని అరెస్టు చేసి చెన్నై నగర శివార్లలోని పుళ్ హల్ సెంట్రల్ జైల్లో పెట్టారు. రషీదుద్దిన్ ప్రస్తుతం చెన్నై సెంట్రల్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.

సీరియల్ బాంబు పేలుళ్లు
తమిళనాడులోని కోయంబత్తులో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసుతో రషీదుద్దిన్ కు సంబంధాలు ఉన్నాయని సమాచారం. ఇలాంటి నిందితుడు రషీదుద్దిన్ కు సెంట్రల్ జైలు సిబ్బంది స్టార్ హోటల్ లో ఉండే సదుపాయాలు కల్పించారు.

ఏసీ, టీవీ, బెడ్
నిందితుడు రషీదుద్దిన్ కు జైల్లో పడుకోవడానికి మంచం, బెడ్, టైంపాస్ కోసం టీవీ, చల్లగా ఉండటానికి ఏసీ, బట్టలు శుభ్రం చేసుకోవడానికి వాషింగ్ మెషిన్, వేడివేడిగా భోజనం చెయ్యడానికి ఎలక్ట్రానిక్ కుకింగ్ స్టౌ, స్మార్ట్ ఫోన్ సదుపాయాలు కల్పించారు.

జైల్లో ఖైదీకి లిక్కర్
నకిలీస్ పాస్ పోర్టు తీసుకున్న కేసులో అరెస్టు అయిన రషీదుద్దిన్ జైల్లో ఎంజాయ్ చెయ్యడానికి వివిద బ్రాండ్ల లిక్కర్ బాటిల్స్ అందుబాటులో ఉన్నాయి. రషీదుద్దిన్ ఉంటున్న సెల్ లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన జైళ్ల శాఖ సిబ్బంది భారీ మొత్తంలో అతని కుటుంబ సభ్యుల నుంచి లంచం తీసుకున్నారని తెలిసింది.

సెల్ ఫోన్ సీజ్
జైల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న రషీదుద్దిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు షాక్ కు గురైనారు. రషీదుద్దిన్ సెల్ ఫోన్ సీజ్ చేశామని, అతను విలాసవంతమైన జీవితం గడపడానికి ఎవరు సహకరించారు అని విచారణ చెయ్యాలని ఆదేశాలు జారీ చేశామని తమిళనాడు జైళ్ల శాఖ ఏడీజీపీ అశుతోష్ శుక్లా తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications