వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala:రాత్రి 7 లోపు సన్నిధానం చేరాల్సిందే, పోలీసుల మానిటరింగ్.. షవర్ల ఏర్పాటు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం ఉన్న శబరిమలకు భక్తులను అనుమతిస్తున్నారు. అయితే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతీ రోజు ఆలయం రాత్రి 9 గంటలకు మూసివేస్తారు. అయితే పంపా నుంచి బయలుదేరే భక్తులు రాత్రి 7 గంటల వరకు సన్నిధానం చేరుకునేలా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత వస్తే ఆలయం మూసివేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

సన్నిధానం వద్ద ఉన్న అధికారులు కోవిడ్-19 ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. ఆయా చోట్ల ఎవరికైనా వైరస్ ఉన్నట్లైతే వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. ప్రతీ విభాగానికి ప్రోటోకాల్‌తో కూడిన కోవిడ్-19 సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ బృందం సన్నిధానం, పరిసర ప్రాంతాలను నిశీతంగా పరిశీలిస్తోంది. వచ్చిన భక్తులు తూర్పు ట్రక్ వద్ద ఇరుముడి విప్పేందుకు ఏర్పాట్లు చేశారు.

Monitoring to be intensified at Sabarimala

Recommended Video

#SabarimalaTemple : సరికొత్త నిబంధనలతో.. భక్తుల కోసం తెరుచుకోనున్న Sabarimala ఆలయ తలుపులు!

కరోనా వైరస్ ప్రోటోకాల్ నేపథ్యంలో రెస్టారెంట్లు డిస్పోజబుల్ ప్లేట్లు, క్లాసులు వాడాల్సి ఉంటుంది. మరకట్టం, చార్లమేడు, సన్నిధానం వద్ద విధుల నిర్వహిస్తున్న అయ్యప్ప సేవా సంఘం కార్యకర్తలకు ఆరోగ్యశాఖ ఫేస్ మాస్క్, గ్లౌజ్ అందజేస్తుంది. పంపా వద్ద మరో రెండు షవర్ షెట్లను తెరుస్తామని అధికారులు తెలిపారు. దీంతో షవర్ల సంఖ్య 60కి చేరుకుంది. అక్టోబర్‌లో షవర్ ఏర్పాటు చేయగా రూ.7.25 లక్షలు కాగా.. మరో రెండు షవర్లు ఏర్పాటు చేయడంతో.. అదీ రూ.20 లక్షలకు చేరింది.

English summary
pilgrims who depart Pampa by 7 p.m. are reaching the Sannidhanam before the hill temple closes at 9 p.m., the police will monitor the movement of pilgrims along the trekking route using CCTVs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X