వెదర్ అప్‌డేట్: ఒడిశా, తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు, అల్లకల్లోలంగా సముద్రాలు
న్యూఢిల్లీ: ఒడిశా రాష్ట్రాలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఒడిశాతోపాటు విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Recommended Video

ఉత్తరాఖండ్, ఛండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గ్యాంగ్టక్ పశ్చిమబెంగాల్, కొంకణ్, గోవా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, దక్షిణ కర్ణాటక , తీర ప్రాంతాలు, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ఘాట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని వాతావారణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమబెంగాల్, ఒడిశా తీరాన్ని ఆనుకుని ఉంది. సముద్ర ముట్టానికి .6 కి.మీటర్ల ఎత్తులో ఇది బలపడుతుండగా...దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో శనివారం, ఆదివారం భారీ వర్షాలు కురవనున్నాయి. అటు మధ్యప్రదేశ్ మీదుగా యూపీని ఆనుకుని మరో అల్పపీడనం కొనసాగుతోంది.

బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో కొంత అల్లకల్లోలం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభావిత ప్రాంతాలైన అండమాన్, పశ్చిమబెంగాల్, ఒడిశా తీరప్రాంతాల్లో సముద్రంపై వేటకు రాబోయే మూడు రోజులు మత్స్యకారులు వెళ్లకూడదని వాతావరణ శాఖ తెలిపింది.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్‌డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications