వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెదర్ రిపోర్ట్: 2-3రోజుల్లో దేశ వ్యాప్తంగా విస్తరించనున్న రుతుపవనాలు, భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆంధ్రప్రదేశ్ తెలంగాణల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు

న్యూఢిల్లీ: రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించనున్నాయి. ఢిల్లీతోపాటు వాయువ్య భారతదేశంలో వర్షాలు కురవనున్నాయి.

భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. జులై 1 వరకు దేశం మొత్తం రుతుపవనాలు విస్తరించనున్నాయి. వాయువ్య భారతదేశంలో మాత్రం 15రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. రుతుపవనాల కారణంగా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ డీఎస్ పాయి తెలిపారు.

Monsoon updates: SW Monsoon to cover entire country over next 2-3 days

గుజరాత్, తూర్పు రాజస్థాన్, పశ్చిమరాజస్థాన్, హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ రుతుపవనాల కారణంగా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

నైరుతి రుతుపవనాల కారణంగా రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తర అరేబియా సముద్ర ప్రాంతం, గుజరాత్, రాజస్థాన్ తోపాటు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్ 28న రుతుపవనాలు కేరళను చేరుకున్నాయి. నెల తొలి భాగంలో పశ్చిమతీరాన్ని ఇవి చుట్టేయనున్నాయి.

పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో గత సంవత్సరం కంటే ఒక రోజు ముందుగానే ఈ సంవత్సరం రుతుపవనాలు చేరుకోనున్నాయి. శుక్రవారం నుంచి ఈ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా అంటే 29-35డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి.

Monsoon updates: SW Monsoon to cover entire country over next 2-3 days

రుతుపవనాల కారణంగా గత వారం నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం దేశ వ్యాప్తంగా చూసుకుంటే -10శాతం మాత్రమే వర్షాలు కురిశాయి. సదరన్ పెనిసుల మాత్రమే 29శాతం ఎక్కువ వర్షపాతాన్ని పొందింది.

భారత తూర్పు-ఈశాన్య మరియు వాయువ్య ప్రాంతాల్లో 29, 24శాతం వర్షాలు కురిశాయి. 36 వాతావరణ ఉపవిభాగాల్లో 24 ఉప విభాగాల్లో తక్కువ, అతి తక్కువ వర్షాలు నమోదయ్యాయి. అంటే 25శాతం దేశం సాధారణ లేదా సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని పొందింది.

వాతావరణ శాఖ ప్రకారం 2017 కంటే ఈ సంవత్సరం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న కారణంగా మంచి వర్షాలు పడే అవకాశం ఉంది. జూన్-సెప్టెంబర్ మధ్య కాలంలో 96-104శాతం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి.

Monsoon updates: SW Monsoon to cover entire country over next 2-3 days

నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే మే 29న కేరళలో ప్రవేశించాయి. గతవారం క్రితం వరకు తూర్పు భారతదేశంలో భారీ వర్షాలు కురిశాయి. కాగా, రుతుపవనాలు 10-12రోజులపాటు విరామం తీసుకోవడం వల్ల వర్షాలు ఈ మధ్య కాలంలో తక్కువగా కురుస్తున్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు.

English summary
The southwest monsoon is set to cover the entire country in the next two days, almost a fortnight ahead of what it would normally take, even as it reached northwest India, including Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X