చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు: వారాంతంలో ఉత్తరాదిన వర్షాలు
న్యూఢిల్లీ: గత పది రోజులుగా బలహీనంగా ఉన్న నైరుతి రుతుపవనాలు ఇప్పుడు బలపడ్డాయి. మహారాష్ట్ర, సెంట్రల్ ఇండియాలో చురుగ్గా కదులుతున్నాయి.
Recommended Video

రుతుపవనాలు విస్తరిస్తుండటంతో ఢిల్లీ సహా ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 29వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు వర్షాలు కురుసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

సెంట్రల్ ఇండియా, నార్త్ ఇండియాలలో కొద్ది రోజులుగా వాతావరణం వేడెక్కింది. రానున్న రెండు మూడు రోజుల్లో వాతావరణం చల్లబడుతుందని తెలిపింది.
మంగళవారం లేదా బుధవారం నుంచి ఉత్తర భారత దేశంలో ప్రీ-మాన్సూన్ కారణంగా అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశముందని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఆదివారం మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. అటు నుంచి మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా విస్తరించాయి.

నార్త్ అరేబియా సముద్రం, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, చత్తీస్‌గఢ్, ఒడిశాలోని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలు, బీహార్‌లలో రానున్న 48 గంటల్లో ప్రవేశించనున్నాయి.
రానున్న 48 గంటల్లో ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లలో రుతుపవనాల కారణంగా చిరుజల్లులు కురిసే అవకాశముంది.

కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్‌లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.
దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications